69th Filmfare Awards : 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 అవార్డ్ వేడుక శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది.కి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన హీరో, హీరోయిన్స్ హాజరై సందడి చేశారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ హోస్ట్ లుగా వ్యవహరించిన ఈ వేడుకలో రాశీఖన్నా, అపర్ణ బాలకమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ తదితరులు తమ ప్రదర్శనలతో అలరించారు. ఇక 2023కు గాను నామినేట్ అయ్యిన చిత్రాల్లో ఏయే చిత్రాలు, ఏయే నటులు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు గెలుగుచుకున్నారో చూద్దాం. కన్నడ సినిమాకు సంబంధించి రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచే ఎల్లో (తెలుగులో సప్త సాగరాలు దాటి) సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి(క్రిటిక్స్) సహా పలు అవార్డులను గెలుచుకుంది. ఇక స్వాతి ముత్తిన మేల్ హానియే సినిమాలో నటనకు గాను సిరి రవి కుమార్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
ఉత్తమ చిత్రం: బలగం
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్‌నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు.. సార్)
ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ సంగీతం: విజయ్ బుల్గానిన్ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా.. దసరా)
ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల్లో దసరా మూవీ సత్తా చాటింది. హయ్యెస్ట్ అవార్డ్స్ గెలుచుకున్న మూవీగా నిలిచింది. పలు విభాగాల్లో పురస్కారాలను దక్కించుకున్నది. దసరా సినిమాకుగాను బెస్ట్ హీరోగా నాని, బెస్ట్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ లకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.