Electric Vehicles : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ పెరిగింది. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణగా ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో ఈవీ వాహనాలు ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అధునాతన సాంకేతికతలను ప్రోత్సహించడానికి అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీ వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ప్రోత్సాహకాలను అందిస్తున్నారు . అయితే పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు.
అయితే పెట్రోల్ బంకులతో పోల్చితే ఈవీ స్టేషన్స్ తక్కువగా ఉండడం కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈవీ స్టేషన్స్ ఏర్పాటు పెరుగుతోంది. పెట్రోల్‌తో బైక్‌లు వినియోగించడం కాస్త తగ్గడంతో ఈవీ స్టేషన్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈవీ వెహికిల్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే బ్యాటరీ చార్జ్ కావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 965 కిలోమీటర్లు ప్రయాణించే ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది.
కార్లు, బైక్స్, ట్రక్స్, బస్సు.. ఇలా ఏ వాహనంలో అయినా కూడా సామ్ సంగ్ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. సామ్‌సంగ్‌లోని బ్యాటరీ విభాగమైన సామ్‌సంగ్ ఎస్‌డీఐ దీన్ని రూపొందించింది. ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం రీఛార్జ్ కావడం విశేషం. 20 ఏళ్ల పాటు ఈ బ్యాటరీకి సర్వీస్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 2027 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ చెబుతుంది. ఒక్కసారి ఇవి మార్కెట్ లోకి వస్తే ఇక ఈవీ వాహనాలకి గిరాకి మరింత పెరుగుతుందని అంటున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.