Home » Entertainment » Aame Katha Fame Navya Swamy Kasthuri Fame Aishwarya Pics
Entertainment

Navya Swamy : ‘ఆమెకథ’, ‘కస్తూరి’ హీరోయిన్ల రచ్చ.. అక్కడ అలా చిత్రవిచిత్రంగా!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 3, 2021, 9:49 pm
Advertisement

Navya SwamyAishwarya,  బుల్లితెర సీరియల్స్ హీరోయిన్ల మధ్య మంచి సంబంధాలుంటాయి. ఎప్పుడూ షూటింగ్‌లలో కలుస్తుంటారు..పైగా ఈ మధ్యలో ఒక సీరియల్ నటీనటులు మరోసీరియల్‌లోకి వెళ్తున్నారు. స్పెషల్ అప్పీయరెన్స్‌లా ఇస్తున్నారు. అలా కొందరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడుతోంది. ఇక పండుగలకు చేసే స్పెషల్ ఈవెంట్లలో అయితే అందరూ ఒకే చోటకు చేరుకుంటారు. అక్కడ పరిచయం అవుతుంటారు.

Advertisement

Aame katha fame Navya Swamy Kasthuri fame Aishwarya Pics

అలా బుల్లితెరపై సెలెబ్రిటీలు రోజూ సెట్స్‌పైనే ఉంటారు. అందుకే వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడుతుంటాయి. అలా ఇప్పుడు ఆమె కథ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి, కస్తూరి ఫేమ్ ఐశ్వర్యా ఇద్దరూ కలిసి రచ్చచేశారు. ఓ షోరూం కోసం ఇస్తోన్న యాడ్‌లో ఈ ఇద్దరూ కలిసి రచ్చ చేశారు. బుల్లితెరపై ఎలా అల్లరి చేస్తుంటారో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా సందడి చేస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి రచ్చ రచ్చ చేస్తున్నారు.

Advertisement

Navya Swamy : కాస్త గ్యాప్ దొరికితే దాగుడుమూతలు.. ఆమె కథ, నవ్యస్వామి, కస్తూరి, ఐశ్వర్య

ముగ్ద అనే షోరూంకి ఇస్తోన్న యాడ్‌లో ఇద్దరూ కలిసి నటిస్తున్నట్టున్నారు. ఆ యాడ్‌కు తగ్గట్టుగా తెలుగుదనం ఉట్టిపడేలా.. నిండుగా నగలు దిగేసుకుని దర్శనమిచ్చారు. ఇక అక్కడే కాస్త గ్యాప్ దొరికినట్టుంది.. ఇద్దరూ కలిసి దాగుడుమూతలు, స్థంబాలంటాలు ఆడేశారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కస్తూరీ సీరియల్‌తోనే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి