Home » Entertainment » Abchor Varshini Wishes Sridevi Vijaykumar
Entertainment

Anchor Varshini : షో నుంచి వెళ్లిపోయినా స్నేహం వీడలేదు.. శ్రీదేవీ వర్షిణి మధ్య ఇంకా అదే బంధమా?

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 30, 2021 7:42 pm
Advertisement

ఒక్కోసారి కొన్ని బంధాలు కొన్ని షోలు, ఈవెంట్ల ద్వారా కలుస్తాయి.. కొన్ని ఆ ఈవెంట్లతోనే ఆగిపోతాయి. ఇంకొన్ని ఎప్పటికీ మిగిలిపోతాయి. అలా వర్షిణి కామెడీ స్టార్స్ షోలో కనిపించింది. కొన్ని రోజులు షోను బాగానే ముందుకు తీసుకెళ్లింది. సోలో యాంకర్‌గా ఎదగడంతో వర్షిణి అభిమానులు సంబరపడిపోయారు. అందులో జడ్జ్‌లు శేఖర్ మాస్టర్, నాటి హీరోయిన్ శ్రీదేవీ విజయ్ కుమార్ వచ్చారు. వారితో వర్షిణి మంచి రిలేషనే మెయింటైన్ చేసింది. కానీ అకస్మాత్తుగా వర్షిణి ఆ షో నుంచి బయటకు వచ్చింది.

Advertisement

Anchor Varshini wishes Sridevi VijayKumar

కామెడీ స్టార్స్ షో నుంచి వర్షిణి రావడంతో అక్కడికి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. సినిమా అవకాశాలు రావడంతో వర్షిణి అక్కడి నుంచి వెళ్లిపోయిందని అంతా అంటుంటారు. అయితే అక్కడి నుంచి వర్షిణి వెళ్లిపోయింది. కానీ వారితో ఉన్న రిలేషన్‌ను మాత్రం తెంచుకోలేదు. శేఖర్ మాస్టర్, శ్రీదేవీ అంటే ఇంకా అదే అభిమానం ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే శేఖర్ మాస్టర్ టెర్రస్ వెబ్ సిరీస్ కోసం వర్షిణి ప్రమోషన్ చేసింది. ఇక ఇప్పుడు శ్రీదేవీ బర్త్ డేను విషెస్ చెప్పింది.

Advertisement

శ్రీదేవీకి వర్షిణి విషెస్

నిన్న శ్రీదేవీ బర్త్ డే. ఈ సందర్భంగా వర్షిణి విషెస్ చెప్పింది. శ్రీదేవీ, అరుణ్ విజయ్ కుమార్, విజయ్ కుమార్ ఇలా ఫ్యామిలీ అంతా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వర్షిణి బర్త్ డే విషెస్ చెబుతూ ఓ పోస్ట్ వేసింది. వర్షిణి చెప్పిన విషెస్‌కు రిప్లైగా శ్రీదేవీ కూడా స్పందించింది. మొత్తానికి వర్షిణి శ్రీదేవీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయని తెలిసిపోయింది. మళ్లీ ఒకవేళ చాన్స్ ఉంటే కామెడీ స్టార్స్‌కు హెస్ట్‌గా వర్షిణి వస్తుందేమో చూడాలి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి