Acharya : జస్ట్ శాంపిల్ మాత్రమే ..ఆచార్య ఏంటో కొన్ని గంటల్లో చూపిస్తారట..!

Authored By vamana sai | The Telugu News | Published on: March 31, 2021, 10:20 am

Acharya​ Laahe Laahe Song : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య. మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్..కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కామ్రెడ్ సిద్ద గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలిసి ఒకే ఫేం లో కనిపిస్తే చూడటానికి రెండు కళ్ళు చాలవని చెప్పుకుంటున్నారు. మెగా అభిమానులకి మాత్రమే కాదు యావత్ తెలుగు సినీ ప్రేమికులకి పెద్ద పండుగే అని చిత్ర యూనిట్ చెప్పుకుంటున్నారట.

అంతగా మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ ఆచార్య సినిమాలో సర్‌ప్రైజ్ చేసి మెస్మరైజ్ చేస్తారట. ఇక ఈ సినిమాలో చరణ్ కి జంటగా పూజా హెగ్డే కనిపించబోతోంది. రెజీనా కసాండ్ర మెగాస్టార్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో మెరవబోతోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈరోజు సాయంత్రం ఆచార్య సినిమా నుంచి అన్నయ్య మెగాస్టార్ సోలో సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ రాం చరణ్ బర్త్ డే రోజునే ఆచార్య చిత్ర బృందం మెగాస్టార్ స్టెప్ వేస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు.

Acharya​ Movie Laahe Laahe Mega Promo

Acharya​ Movie Laahe Laahe Mega Promo

Acharya​ Laahe Laahe Song : ఆచార్య డాన్స్ బిట్ తో ఉన్న వీడియోని రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో చిన్న డాన్స్ బిట్ తో ఉన్న వీడియోని రిలీజ్ చేశారు. ఇది శాంపిల్ మాత్రమే ఆచార్య ఏంటో కొన్ని గంటల్లో చూపిస్తాడు అంటూ మేకర్స్ అభిమానులను ఉత్సాహ పరిచారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన డాన్స్ బిట్ లో మెగాస్టార్ స్టెప్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 60 ఏళ్ళు పైబడిన మెగాస్టార్ లో ఇంకా అదే గ్రేస్స్ అదే పవర్ కనిపిస్తోంది. డాన్స్ అంటేనే మెగాస్టార్ అని అందరికీ తెలిసిందే. అలాంటి డాన్స్ తో ఆచార్య సాంగ్స్ లో అదరగొట్టబోతున్నాడట మెగాస్టార్. ఇక ఈ సినిమా మే 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp