#image_title
Actor Ali : శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సినీ నటుడు ఆలీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని అన్నారు. ఎక్కడ అమలు చేయని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి చూపించిన పార్టీ వైసీపీ దేనని కొనియాడారు. మరోసారి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బరిలో ఉన్న నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని మీ వెంట ఉంటానని ధైర్యం ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు కూడా ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించారు.
ఇప్పుడు వై.యస్.రాజశేఖర్ రెడ్డి తనయుడుగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి ప్రజలను హత్తుకున్నారు. ఆయనను ఆదరించి గెలిపించారు. నవరత్నాలు అని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల కష్టాలను దూరం చేశారు. ఇంకా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బాగా ఉంది కానీ ఆయనను అణగదొక్కెందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంత బాధ ఉన్నా వై.యస్.జగన్మోహన్ రెడ్డి పైకి చిరునవ్వుతోనే కనిపిస్తారు. తన ఫ్యామిలీ దూరం అవుతున్న ఎప్పుడు చికాకు చూపించలేదు. ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నారు అని ఆలీ వ్యాఖ్యానించారు. ఇక వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నెదురమల్లి రాంకుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని ఎప్పుడు చెప్పుకోలేదు.
మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కచ్చితంగా రామన్నను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని ప్రజలను ఆలీ కోరారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని ఆదరిస్తారు. ఏ పార్టీలో లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూడా పార్టీలో స్థానం కల్పించారు. అందుకే వై.యస్.జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు అని ఆలీ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత ప్రయత్నించినా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు అని అన్నారు. ఇకపోతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలీ స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెడితే ఆలీ అధికార పార్టీ వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి ఆలీ మధ్య స్నేహం చెడిందని వార్తలు వచ్చాయి. వైసిపి ప్రభుత్వంను సపోర్ట్ చేస్తున్న ఆలీకి పవన్ కళ్యాణ్ మధ్య గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.