Home » Entertainment » Actor As Ys Jagan In Yatra 2
Entertainment

Yatra 2 : ‘యాత్ర 2’లో వైఎస్ జగన్ పాత్రలో నటించేదెవరో తెలుసా..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: July 3, 2021, 9:02 am
Advertisement

Yatra 2 : టాలీవుడ్ లో వాస్తవ సంఘటనల ఆధారంగా, నిజ జీవిత కథలను ఆధారంగా గత కొన్నేళ్ళుగా వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. కమర్షియల్ సినిమాలంటూ హీరోయిన్స్ చేసే ఎక్స్‌ఫోజింగ్ కి అర్థం పర్థం లేని ఫైట్స్ కి జబర్దస్త్ కామెడీ లాంటీ జోకులకి జనాల మొహం మొత్తేసింది. కొత్తదనం అంటూ వస్తున్న బీ గ్రేడ్ సినిమాలను చూడాలంటే ప్రేక్షకులకి చిరాకొస్తోంది. అయితే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో సినీ, రాజకీయ నాయకులతో పాటు, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ బయోపిక్స్ ని రూపొందిస్తున్నారు. దాదాపు బయోపిక్స్ అన్నిటికీ ప్రేక్షకులనుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలను నిర్మించేదుకు నిర్మాతలు, దర్శకులు, నటించేందుకు హీరోలు సిద్దంగా ఉంటున్నారు.

Advertisement

actor as ys jagan in yatra 2…?

ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ్ 2019లో రూపొందించిన వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ సినిమా అద్భుతమైన సక్సెస్ ను అందుకుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి టైటిల్ రోల్ లో నటించారు. పాత్రలో జీవించిన ఆయనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దాంతో ఆ వెంటనే ఈ సినిమాకి సీక్వెల్ తీయనున్నట్టు డైరెక్టర్ మహి వి రాఘవ్. అఫీషియల్ గానే ప్రకటించాడు. అంతేకాదు ఈ సీక్వెల్ కి ‘యాత్ర 2’ పేరుని పెట్టి టైటిల్ కూడా ప్రకటించారు. దాంతో
ఆయన అభిమానుల్లో ఎంతో ఆసక్తి కలిగింది. అంతేకాదు ఈ సినిమాలో జగన్ పాత్రలో నటించేదెవరు అనే చర్చలు సాగాయి.

Advertisement

Yatra 2 : జగన్ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు ప్రతీక్ గాంధి..!

ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తాడని ప్రచారం జరిగింది. కాగా తాజాగా డైరెక్టర్ మహి వి రాఘవ్. తెరకెక్కించనున్న యాత్ర 2 బాలీవుడ్ విలక్షణ నటుడు ప్రతీక్ గాంధిని తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఈ న్యూట్ హాట్ టాపిక్ అవడమే కాదు..అతని పిక్ సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది. కాగా ఈ సీక్వెల్ సినిమాలో జగన్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించబోతున్నారు. ప్రతీక్ గాంధీ ‘స్కామ్ 1992’లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన అచ్చం జగన్ పోలికలు, హావభావాలతో ఉండటంతో దాదాపు ఆయననే మేకర్స్ ఫైనల్ చేశారట. త్వరలో దీనికి సంబంధించిన అధికారక ప్రకటన రానుంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి