Actor Nani : థియేటర్ కంటే కిరాణా దుకాణం నయమంటూ.. ఏపీ ప్రభుత్వ తీరుపై హీరో నాని ఊహించని వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Actor Nani : థియేటర్ కంటే కిరాణా దుకాణం నయమంటూ.. ఏపీ ప్రభుత్వ తీరుపై హీరో నాని ఊహించని వ్యాఖ్యలు..!

Actor Nani : సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హీరో నాని ఊహించని వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ రేటును తగ్గించడం కారణంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు.. ఓ కిరణా షాపుకు వచ్చిన కనీస ఆదాయం కూడా రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల ధరల విషయంలో ఎవరూ కోరకపోయిన వాటిని తగ్గించి సినీ ప్రేక్షకులను ఏపీ ప్రభుత్వం అవమానించిందన్నారు. ఈ అంశంపై ఇప్పుడు తను […]

 Authored By inesh | The Telugu News | Updated on :23 December 2021,3:40 pm

Actor Nani : సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హీరో నాని ఊహించని వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ రేటును తగ్గించడం కారణంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు.. ఓ కిరణా షాపుకు వచ్చిన కనీస ఆదాయం కూడా రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల ధరల విషయంలో ఎవరూ కోరకపోయిన వాటిని తగ్గించి సినీ ప్రేక్షకులను ఏపీ ప్రభుత్వం అవమానించిందన్నారు.

ఈ అంశంపై ఇప్పుడు తను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందంటూ… తప్పని సరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందన్నారు. టికెట్ రేట్ల విషయంలో ప్రేక్షకులకు లేని అభ్యంతరం వారికి ఏమిటో అర్థం కావడం లేదంటూ ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా టిక్కెట్ ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ జారీ చేసిన జీవోపై టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఏకంగా నేల టికెట్ రేటును రూ. 5 గా నిర్ణయించడంతో.. నష్టాలు తప్పవని కొన్ని థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసి వేస్తున్నాయి.

actor nani comments on ap govt regarding discounting movie ticket prices

actor nani comments on ap govt regarding discounting movie ticket prices

ఈ కారణంగా ప్రభుత్వ తీరుని ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రెట్టింపు చేసేలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల గురించి పవన్ కల్యాణ్ ఫైర్ అయినప్పుడు ఆయనకు నానీ మద్దతుగా మాట్లాడారు. ఆయన నటించిన శ్యామ్ సింగ రాయ్ రేపు అవ్వనుండగా ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మీడియాతో నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

inesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది