Bigg Boss Telugu 7 : యాక్టర్ శివాజీ తెలుసు కదా. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ 7 హౌస్ లో ఉన్నారు. నిజానికి ఆయన ఏం మాట్లాడినా కొంచెం ఆలోచించి మాట్లాడుతారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడరు అనే టాక్ ఉంది. తొందరపడరు. అందరితో కలిసిమెలిసి పోతారు అని అందరూ అనుకున్నారు. హౌస్ లో అడుగు పెట్టిన రెండు మూడు రోజుల వరకు శివాజీ పెద్దగా వివాదాల జోలికి పోలేదు కానీ.. నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం శివాజీని ఓపిక నశించింది. సహనం కోల్పోయాడు. బీపీ పెరిగిపోయినట్టుంది. ఒక సైకోలాగా మారిపోయి హౌస్ లో రచ్చ రచ్చ చేశాడు శివాజీ. దీంతో ఇతర కంటెస్టెంట్లు కూడా అసలు ఇంట్లో ఏం జరుగుతోంది అని టెన్షన్ పడ్డారు.
శివాజీ కాఫీ లేకుండా ఉండలేడు. తనకు కాఫీ పౌడర్ కావాలని బిగ్ బాస్ కు చాలా సార్లు రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాడు. అలాగే.. బీపీ ట్యాబ్లెట్స్ కూడా కావాలని అడిగాడు. ఉదయం నుంచి అడుగుతున్నా కూడా బిగ్ బాస్ శివాజీకి కాఫీ పౌడర్ పంపించలేదు. బీపీ ట్యాబ్లెట్స్ కూడా పంపించలేదు. దీంతో బిగ్ బాస్ పై శివాజీ రెచ్చిపోయాడు. అసలేందిది.. ఏం జరుగుతోంది అంటూ కోపంతో అరిశాడు. కాఫీ పంపవోయ్ అంటూ కిచెన్ లో ఉన్న ఓ ప్లేట్ ను విసిరేస్తాడు శివాజీ. బొక్కలో బడ్జెట్.. కాఫీ లగ్జరీ బడ్జెట్ ఏంటి.. అంటూ బూతులు మాట్లాడటం స్టార్ట్ చేశాడు శివాజీ. కాఫీ ఇవ్వడానికి పెద్ద ఏముంది అందులో. టీ ఇచ్చిన వాడు కాఫీ ఇస్తే వచ్చే సమస్య ఏంటి అంటూ బిగ్ బాస్ పై సీరియస్ అవుతాడు. గేట్ తీయవయ్యా.. నేను వెళ్లిపోతా. బొక్కలోది అంటూ బిగ్ బాస్ పై సీరియస్ అయ్యాడు శివాజీ.శివాజీ బాధను చూడలేక షకీలా కూడా బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేస్తుంది. కాఫీ పౌడర్ ఒక్కటి పంపించండి బిగ్ బాస్. ఆయన ఉదయం నుంచి ఏం తినలేదు. కాఫీ ఒక్కటే అడుగుతున్నాడు. పంపించండి అంటూ షకీలా కూడా రిక్వెస్ట్ పెట్టుకుంది.
అరె ఏందిది.. కాఫీ ఇవ్వడానికి ఇన్ని డ్రామాలా అంటూ శివాజీ అక్కడే ఉన్న ఓ బకెట్ ను కూడా తన్నేస్తాడు. నాలుగు రోజుల నుంచి కూడా ఆయన కాఫీనే అడుగుతున్నాడు. వెంటనే పంపించండి అంటూ షకీలా కూడా బిగ్ బాస్ ను వేడుకుంటుంది. వాడు ఇవ్వడు అమ్మ. వేస్ట్ అంటాడు శివాజీ. ఏం అవసరం లేదు.. నేను పోతా. నాకు అవసరం అంటాడు శివాజీ. రాసి ఇచ్చాను.. ట్యాబ్లెట్స్, కాఫీ పౌడర్ కావాలని. కానీ.. వాళ్లు పంపించలేదు. ఇంకో గంట చూస్తా. బొక్క కూడా భయపడను ఎవ్వరికీ అంటాడు.
కానీ.. బిగ్ బాస్ మాత్రం బీపీ మిషన్ పంపిస్తాడు. శివాజీ బీపీ చెక్ చేయాలని డాక్టర్ అర్జున్ కు చెబుతాడు. దీంతో శివాజీకి ఇంకా చిర్రెత్తుకొస్తుంది. కోపం ఎక్కువవుతుంది. ఆ తర్వాత బిగ్ బాస్.. శివాజీని యాక్టివిటీ రూమ్ కు పిలుస్తాడు. అయితే.. ఇదంతా బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేయడం కోసం శివాజీ చేసిన యాక్టింగ్. బిగ్ బాస్ అందరికీ ఒక టాస్క్ ఇస్తాడు. మీలో ఎవరైనా బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేస్తే హౌస్ మెట్ గా కన్ఫమ్ కావడంతో పాటు 5 వారాల పాటు ఇమ్యూనిటీని ఇచ్చే కంటెండర్ల పోటీకి ఒక్కరిని సెలెక్ట్ చేస్తా అని చెబుతాడు. ఇప్పటికే ఆట సందీప్, ప్రియాంక జైన్ ఇద్దరూ కంటెండర్లుగా నిలిచారు. వాళ్లతో మరొకరు పోటీ పడటం కోసమే బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేయాలన్నమాట. అందుకోసమే బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేయడం కోసమే శివాజీ ఆడిన డ్రామా అది. ఆ తర్వాత శివాజీని యాక్టివిటీ రూమ్ కు పిలిచి కాఫీని ఇచ్చి పంపిస్తాడు బిగ్ బాస్. దీంతో శివాజీ కూల్ అయిపోతాడు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.