Anil Kumar Yadav : నన్ను ఇవాళో రేపో అరెస్ట్ చేసినా చేస్తారు అని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేపుతోంది. 118 కోట్ల అవినీతిలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని.. ఇందులో నారా లోకేష్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెబుతున్నారు. అందుకే త్వరలోనే చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. గత నెలలో దానికి సంబంధించిన ఐటీ నోటీసులు చంద్రబాబుకు ఇస్తే ఇప్పటి వరకు విచారణకు కూడా హాజరు కాలేదు. అంటే చంద్రబాబు తప్పు చేసినట్టు కదా.చంద్రబాబుకు వచ్చిన నోటీసులపై, ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. నారా లోకేష ఏం పతివ్రత కాదని.. మా డాడీ నిప్పు అంటావు..
నువ్వు ఏంటయ్యా మరి.. నువ్వు తుప్పా? నువ్వు కూడా మీ నాన్నతో కలిసి విచారణకు వెళ్లాలి అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.మేం నిజాయితీపరులం అని నారా లోకేష్ తెగ మాట్లాడుతున్నాడు కదా. లోకేష్ పేరు అందులో లేదా? 46 పేజీలలో 118 కోట్ల స్కామ్ కు సంబంధించి చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు కూడా ఉంది. దుబాయిలో కూడా వీళ్లకు ముడుపులు అందాయి. కేవలం రెండు ఏజెన్సీల నుంచే 118 కోట్లు తీసుకున్నారు. అమరావతి భూములు అనే దాని పేరుతో అతి పెద్ద భూదందా, కమిషన్ల దందా జరిగింది. చంద్రబాబు మీద ఎన్ని కేసులు వేస్తే ఆ కేసులకు స్టేలు తెచ్చుకోవడం, జడ్జిలతో మాట్లాడి స్టేలు తెప్పించుకోవడం చేశారు. ఇప్పుడు మీ బండారం మొత్తం బయటపడింది. 5 ఏళ్లకు సంబంధించి మీ డొంక అంతా కదిలితే వేల కోట్ల కుంభకోణం బయటికి వస్తుంది.
దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలి. తల దొరికేసింది.. డొంక కదిలితే పచ్చ మీడియా, దత్త పుత్రుడు ఇలా అందరూ బయటపడే అవకాశం ఉంది. అందుకే మీరు ఎక్కడైనా దాక్కున్నారా? ప్యాంట్లు తడిసిపోతున్నాయా? అంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.