Actress : రిక్షావాడు ప్యాంట్ జిప్ తీసాడు.. టైల‌ర్ అదోలా ట‌చ్ చేశాడ‌న్న హీరోయిన్

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: September 24, 2024, 8:00 pm
  •  Actress : రిక్షావాడు ప్యాంట్ జిప్ తీసాడు.. టైల‌ర్ అదోలా ట‌చ్ చేశాడ‌న్న హీరోయిన్

Actress  : తెలుగులో ఒకప్పుడు త‌న అందచందాల‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది అనిత‌. వరుస సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్మడు. కానీ అందంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటుంది. తేజ దర్శకత్వంలో 2001లో విడుదలైన నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనిత హస్సానందని. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో కల్ట్ లవ్ స్టోరీగా నిలిచింది నువ్వు నేను సినిమా. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నువ్వు నేను సినిమా తర్వాత మరోసారి ఉదయ్ కిరణ్ తో శ్రీరామ్ సినిమాలో నటించింది.

Actress  చిన్న‌ప్ప‌టి చేదు జ్ఙ‌పకాలు

సినిమాలతో పాటు టెలివిజన్ లోనూ అనిత మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.గతంలో అనిత ఎజాజ్‌ ఖాన్ అనే బాలీవుడ్ నటుడిని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం నడిచింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు.ఇక 14 అక్టోబర్ 2013న అనిత గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. వారితో సంతోషంగా జీవితం గ‌డుపుతూనే మరోవైపు అడ‌పాద‌డ‌పా సీరియ‌ల్స్‌లో న‌టిస్తుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తన చిన్ననాటి భయంకర ఎపిసోడ్‌ల‌ను గుర్తుచేసుకుంది. ఒక రిక్షా డ్రైవర్ అశ్లీలంగా సిగ్న‌ల్ ఇస్తూ.. తనను, తన స్నేహితులను పాఠశాలలో ఉన్నప్పుడు వేధించాడంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

Bollywood Heroine : ఒక్క నైట్ కి 4 కోట్లు.. హీరోయిన్ పై సెన్సార్ సభ్యుడి ఆరోపణలు.. బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత..?

Actress : రిక్షావాడు ప్యాంట్ జిప్ తీసాడు.. టైల‌ర్ అదోలా ట‌చ్ చేశాడ‌న్న హీరోయిన్

స్కూల్ చ‌దివేట‌ప్పుడు క్యాంటిన్ ద‌గ్గ‌ర రిక్షావోడు ఉండేవాడు. అత‌డు కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడల్లా అతడు తన ప్యాంటు జిప్ తెరిచి ఉంచేవాడు. న‌న్ను తాకేవాడు. మమ్మల్ని అదే ప‌నిగా చూసేవాడు. ఆ వ్యక్తిని చూసి భయపడి మేం వేరే రూట్‌లో వెళ్లే వాళ్లం. అప్ప‌టి నుండి రిక్షా క‌నిపిస్తేనే భ‌యం వేసేది. రిక్షా పుల్ల‌ర్ త‌మ‌ని ఎక్క‌డ వెంబ‌డిస్తాడో అని టెన్ష‌న్ ప‌డే వాళ్లం. ఇక ఓ స‌మ‌యంలో టైలర్ తనను పట్టుకున్న‌ మరో సంఘటనను కూడా అనిత వివరించింది. దర్జీకి అరవై ఏళ్లు పైనే ఉన్నాయ‌ని, కాని అత‌ను న‌న్ను ప‌ట్టుకున్న తీరు వేరేలా ఉండేద‌ని కూడా వెల్ల‌డించింది. కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే… ఇటీవల టెలివిజన్ షో `హమ్ రహెం నా రహెన్ హమ్‌`లో కనిపించింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp