
#image_title
Anjali : మామూలుగానే సినీ సెలబ్రిటీల విషయంలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. చిన్న హింట్ ఇచ్చినా సరే అందులో ఉన్న మొత్తం సమాచారాన్ని లాగేస్తుంటాయి మీడియా సంస్థలు. ఇక అందులోనూ హీరోయిన్ పెళ్లి, డేటింగ్ లాంటి యవ్వారాలు అయితే మామూలుగా వైరల్ కావు కదా. ఇప్పుడు హీరోయిన్ అంజలి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. వాస్తవానికి తెలుగు అమ్మాయి అయిన అంజలి.. తమిళ సినిమాలతోనే కెరీర్ స్టార్ట్ చేసింది. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అక్కడ స్టార్ డమ్ తెచ్చుకున్న తర్వాతనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మరీ ముఖ్యంగా అంజలి అంటే టక్కున అందరికీ గుర్తొచ్చేది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెల్లు సినిమాలోని సీత పాత్రనే. అందులో అంతగా లీనమైపోయి నటించింది ఈ భామ. మొన్నటి వరకు ఇటు తెలుగులో అటు తమిళంలో హీరోయిన్ గా చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ గడిపేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వ్యక్తిగత విషయాల గురించి కూడా వార్తలు బాగానే వస్తున్నాయి. ఆమె పెళ్లి విషయంలో పలుమార్లు చాలానే వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమె ఓ వ్యాపరవేత్తను పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అవేమీ నిజం కాదని ఆమె కొట్టి పారేసింది.
ఆ తర్వాత తమిళ హీరో జైతో ప్రేమలో ఉందని.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ చాలానే వార్తలు వైరల్ అయ్యాయి. చివరకు అవి కూడా నిజం కాదని.. తామిద్దరం మంచి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చింది అంజలి. అయినా సరే ఆమె పెళ్లి వార్తలు ఆగట్లేదు. ఇప్పుడు ఏకంగా ఓ తెలుగు నిర్మాతతో పెళ్లికి రెడీ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నిర్మాతకు ఇప్పటికే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయని.. గతేడాది నుంచి ఆ నిర్మాతతో అంజలి డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరువురు పెళ్లి చేసుకుంటారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనిపై అంజలి స్పందిస్తేనే నిజం ఏంటో తెలుస్తుంది.
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
This website uses cookies.