
#image_title
Tula Rasi : ఈ హోలికా పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుంచి కీలకమైన ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి. ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల వీళ్ళు ఎంతగానో మేలు పొందుతారు. బంధు వర్గంలో పదేపదే మీ నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగించడం మొదలు పెడతారు. రాజకీయ వ్యూహం అనేది ఫలిస్తుంది.మీకు దీపారాధన చేసే అలవాటు ఉంటే గనుక మీరు దీపారాధన చేసే కుందులో రెండు చుక్కలు పరిమళగంధం వేసి దీపారాధన చేయండి, వైరీవర్గంతో హోరాహోరీ పోరాటాన్ని జరుపుతారు. ఎవరైతే ఆహార నియమాలు పాటిస్తారో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా మీరు వాటిని తట్టుకోగలుగుతారు.
శుభకార్యాల విషయంలో కానీ అనుకూలత కోసం మీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీరు రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించండి.
వెన్నుపోటు దారిలో స్నేహితుల్లోనే ఉన్నారన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఇటువంటి వారితో మీరు స్నేహం చేసినందుకు తీవ్రంగా భాదపడతారు. ఇక నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకుంటారు. ఇక మనకెందుకులే మనం తప్పించుకుపోదాం. మీరు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి..? సేవలు ఎందుకు చేయాలి? నా తోడు పుట్టిన వాళ్లకి లేని బాధ్యత నాకు మాత్రం ఎందుకు ఈ విధంగా మీరు ఆలోచించరు. ఇటువంటి ఆలోచన మీ కలలో కూడా రాదు. ధర్మాన్ని వదిలేస్తే భగవంతుడు మనల్ని వదిలేస్తాడు అనేది మీ ప్రగాఢ నమ్మకం. ఇదే రకమైన బుద్ధి అందరికీ ఉంటే ఈ దేశం ఎంతో బాగుండేది కదా అనే ఆలోచన కలుగుతుంది. ఫైనాన్స్ మరియు చిట్టిల వ్యాపారం పెడితే మాత్రం దివాలా చేస్తారో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రత్యేకమైన విషయంలో మీరు జాగ్రత్తగా తీసుకోకపోతే నష్టపోతారు. ఇక పెళ్లి చేసుకోమని వేధిస్తున్న ఒక వ్యక్తి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతుంది. కీలకమైన సమయంలో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు.
మీ శత్రు వర్గానికి తగిన విధంగా గట్టి గుణపాఠం చెప్తారు. అవార్డులు రివార్డులు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. మొత్తం మీద ఈ హోలీకా పూర్ణిమ అదే విధంగా చంద్రగ్రహణం తర్వాత నుంచి తులారాశి వారి జీవితం ఎంతో కీలకంగా మారుతుంది. కాబట్టి మీరు ఏం చేసినా అందులో మీ యొక్క సంతోషాన్ని చూసుకుంటూ ఆ విధంగా మీరు జీవితంలో ముందుకు వెళ్లాలి. అయితే ఈ సమయంలో గురు శుక్ర మోజులు రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి చేసుకునే వారికి ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది. ఎక్కడికి వెళ్లినా గౌరవంగా ఆహ్వానించే వారిని అధికంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కార్యాన్నికూలత సిద్ధిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి పని పట్ల మీరు నిబద్ధతతో ఉండండి సరిపోతుంది. ఇక మీ జీవితం కూడా టర్నింగ్ పాయింట్ని అందుకునేటటువంటి అద్భుతమైన క్షణాలు కూడా ఇవే కాబట్టి మీరు చంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేయాలి. చంద్రగ్రహణం కారణంగా ఈ తర్వాత మీరు చంద్రునికి సంబంధించిన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలైతే కలుగుతాయి,
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
This website uses cookies.