Home » Entertainment » Actress Kamilini Mukharjee Latest Photos Goes Viral
Entertainment

Kamalini Mukherjee : అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన .. ఒకప్పటి స్టార్ హీరోయిన్ కమలిని ముఖర్జీ .. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 13, 2023, 1:00 pm
Advertisement

Kamalini Mukherjee : టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. తమ అందం నటనతో ప్రేక్షకులను అలరించి కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోతారు. కానీ ఇప్పటికి వాళ్ళు ప్రేక్షకుల మనసులో మెదులుతూ ఉంటారు. వారి ఖాతాలో ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన వాళ్లు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోతారు. ఒక్కసారి అలాంటి హీరోయిన్స్ ని చూస్తే ఓ ఈ హీరోయిన్ ఆ సినిమాలో బాగా నటించింది అని గుర్తుచేసుకుంటారు. అలాంటి హీరోయిన్స్లలో ఒకరు కమలిని ముఖర్జీ.

Advertisement

తెలుగు పరిశ్రమలోకి ‘ ఆనంద్ ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కమలిని ముఖర్జీ. శేఖర్ కమ్ముల దర్శకత్వ వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవడంతో ఆమెకు కూడా వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఆనంద్ సినిమా హిట్ తర్వాత గమ్యం, మీనాక్షి, గోదావరి, క్లాస్ మేట్స్, హ్యాపీడేస్, జల్సా, గోపి గోపిక గోదావరి, రామాచారి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక చివరిగా రామ్ చరణ్ ‘ గోవిందుడు అందరివాడేలే ‘ సినిమాలో నటించింది.

Actress Kamilini Mukharjee latest photos goes viral

Advertisement

ఆ తర్వాత ఇక ఏ సినిమాలోను నటించలేదు. ఎక్కడ కనిపించలేదు కూడా. అయితే ప్రస్తుతం కమలిని ముఖర్జీ అమెరికాలో స్థిరపడిందని సమాచారం. బిజినెస్ రంగంలో బిజీగా గడుపుతున్నట్లు టాక్. ఈమధ్య డల్లాస్ లో జరిగిన ఓ వేడుకల్లో కమలిని ముఖర్జీ కనిపించారు. కొంచెం బొద్దుగా అయిపోయారు. బ్లూ డ్రెస్ వేసుకొని అందరిని మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ అసలు ఈమె కమలిని ముఖర్జీనేనా అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంచెం బొద్దుగా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి