Allu Arjun : జైల్లో అల్లు అర్జున్ కి అవమానం.. నాకు జరిగిందే తనకి అంటూ నటి కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Allu Arjun : జైల్లో అల్లు అర్జున్ కి అవమానం.. నాకు జరిగిందే తనకి అంటూ నటి కామెంట్స్..!
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ allu arjun పుష్ప2తో బడా హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక ఆ తర్వాత బన్నీ లేని పోని చిక్కుల్లో పడ్డాడు. ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Allu Arjun : జైల్లో అల్లు అర్జున్ కి అవమానం.. నాకు జరిగిందే తనకి అంటూ నటి కామెంట్స్..!
Allu Arjun సేమ్ నా మాదిరిగానే..
ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి నటి కస్తూరి Kasturi షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జైలులో ఎలా ఉంటుందో వివరించారు. జైలు లోపలికి వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళ్తామని కస్తూరి శంకర్ వివరించారు.
పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే చెక్ చేస్తారని ఆమె తెలిపింది. ఒంటి మీద నూలుపోగు లేకుండా చెక్ చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే మహిళా ఖైదీలను చెక్ చేసేవాళ్లు లేడిస్ ఉంటారని ఈ భామ తెలిపింది. అయితే నా ప్రైవేట్ పార్ట్స్‌లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారని కస్తూరి శంకర్ చెప్పారు. మూడుసార్లు గుంజీలు తీయిస్తారని చెప్పుకొచ్చారు. జైలులో కిందే పడుకోవాలని ఆమె తెలిపారు. అల్లు అర్జున్‌కు సైతం ఇదే జరిగి ఉంటుందని ఆమె తెలిపింది. అల్లు అర్జున్ Allu arjun ను కూడా మొత్తం న్యూడ్‌గా ఉంచి చెక్ చేసి ఉంటారు అనుకున్నాను అని కస్తూరి పేర్కొంది.