Actress : భార్య‌ని వదిలేశాడు, 17 ఏళ్ల కూతురు.. ఆ వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Actress : భార్య‌ని వదిలేశాడు, 17 ఏళ్ల కూతురు.. ఆ వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్..!

Actress : ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కుమార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఆమె హీరోయిన్‌గా అల‌రించి ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో సంద‌డి చేస్తుంది. అయితే ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. నికోలాయ్ సచ్ దేవ్ తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. జులై 2న థాయ్ ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- సచ్ దేవ్ ల వివాహం జరుగుతుందని సమాచారం.ముహూర్తం దగ్గర పడడంతో పెళ్లి పనుల్లో బిజీగా మునిగిపోయారు […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Actress : భార్య‌ని వదిలేశాడు, 17 ఏళ్ల కూతురు.. ఆ వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్..!

Actress : ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కుమార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఆమె హీరోయిన్‌గా అల‌రించి ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో సంద‌డి చేస్తుంది. అయితే ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. నికోలాయ్ సచ్ దేవ్ తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. జులై 2న థాయ్ ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- సచ్ దేవ్ ల వివాహం జరుగుతుందని సమాచారం.ముహూర్తం దగ్గర పడడంతో పెళ్లి పనుల్లో బిజీగా మునిగిపోయారు వరలక్ష్మి కుటుంబ సభ్యులు. తమ వివాహ వేడుకకు రావాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానిస్తోందీ అందాల తార.వరలక్ష్మి కలిసిన వారిలో సమంత, నయనతార, రవితేజ, అడవిశేష్, థమన్, ప్రశాంత్ వర్మ, గోపిచంద్ మలినేని, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి తదితరులు ఉన్నారు.

Actress అత‌నెలా న‌చ్చాడు..

ఇక వ‌ర్మ‌ల‌క్ష్మీ పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి గురించి ఆమెకి 14 ఏళ్లుగా బాగా తెలుసట. కొన్నాళ్లుగా మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న‌ వీళ్లు.. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. ఇక వరలక్ష్మీకి కాబోయే భర్త నికోలాయ్ ముంబాయ్‌లో వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకి ముంబాయ్‌లో ఓ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అంతేకాకుండా నికోలాయ్‌కు ఆల్రెడీ పెళ్లి కూడా అయింది. నికోలాయ్‌కి ముంబైలో సొంతంగా ఆర్ట్ గ్యాలరీ ఉండ‌డంతో అక్కడికి తరచుగా బాలీవుడ్ సెలెబ్రిటీలు వస్తుంటారు. ఆ విధంగా నీకొలాయ్ కి సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. తొలిసారి నికొలాయ్ సచ్ దేవ్, వరలక్ష్మి అక్కడే కలుసుకున్నారట. పరిచయం పెరగడంతో ఫ్రెండ్స్ అయ్యారు.అయితే అత‌ను 2006లో ఫిట్ నెస్ కోచ్ అయిన కవిత అనే మహిళని వివాహం చేసుకున్నాడు. వీరికి కషా అనే కుమార్తె కూడా ఉంది. సరైన కారణాలు తెలియవు కానీ 2019లో సచ్ దేవ్ తన భార్య కవితకి దూరమయ్యాడు.

Actress భార్య‌ని వదిలేశాడు 17 ఏళ్ల కూతురు ఆ వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్

Actress : భార్య‌ని వదిలేశాడు, 17 ఏళ్ల కూతురు.. ఆ వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్..!

అంటే 13 ఏళ్ళ వివాహ బంధం తర్వాత వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో సచ్ దేవ్, వరలక్ష్మి మధ్య రిలేషన్ పెరుగుతూ వచ్చింది. కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనంలో ఉన్నట్లు కూడా తెలిసింది. ఎట్టకేలకు తమ రిలేషన్ ని సచ్ దేవ్, వరలక్ష్మి నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం సచ్ దేవ్ కుమార్తె వయసు 17 ఏళ్ళు. అంత పెద్ద కుమార్తె ఉంది.. పైగా సెకండ్ మ్యారేజ్.. అతడిని ఎందుకు వరలక్ష్మి వివాహం చేసుకుంటోంది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. పైగా అతడి లుక్స్ పై కూడానా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఒళ్ళంతా టాటూలు, పొడవైన జుట్టు ఏంటి ఆ లుక్ అంటూ నెటిజన్లు అవాక్క‌య్యారు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం సచ్ దేవ్ తో ఘాడమైన ప్రేమలో ఉంది. అతడి తల్లి దండ్రుల నుంచి సచ్ దేవ్ కి 80 కోట్ల వరకు ఆస్తులు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది