actress samantha emotional comments on her breakup with Naga chaitanya
samantha : తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత.. అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాలుగేళ్లు తిరగకముందే.. ఆ ఇంటి నుంచి బయటికొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఎంతో అన్యోన్యంగా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడి పోవడం అందరినీ కలచి వేసింది. ఇదిలా ఉండగా విడాకుల అనంతరం సమంత వరుస చిత్రాలకు సైన్ చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రస్తుతం తన బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం ఎవరికో ఒకరికి పరోక్షంగా ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులను ఆలోచనల్లో పడేస్తోంది. తన పర్సనల్ లైఫ్ గురించి వస్తోన్న రూమర్లకు చెక్ పెడుతూనే మరెన్నో అనుమానాలకు తావిస్తోంది.
ముఖ్యంగా సమంత షేర్ చేస్తున్న పలు కొటేషన్లు సామజిక మాధ్యమాలలో ఈమధ్య బాగా వైరల్ అవుతున్నాయి.అయితే ఇన్నిరోజులు ఇన్ డైరెక్ట్ గా ఏమీ అర్థం కాని పోస్టులు పెట్టిన సమంత… ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో జరిగిన తన వ్యక్తిగత పరిణామాల అనంతరం తన జీవితం ఎలా ఉంటుందో ? తనకు ఎలాంటి అంచనాలు లేవని సామ్ చెప్పింది. తాను ఎంతో జాగ్రత్తగా వేసుకున్న ప్లాన్స్ అన్ని… కుప్పకూలిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఎవరికైన తమ జీవితంలో చెడు రోజులు వచ్చినా.. తమ పని మధ్యలో ఆగిపోయినా కూడా… అలాంటి వాటిని వెంటనే అంగీకరించమని సమంత పేర్కొంది. జీవితంలో ఎదురైన సమస్యలపై ఎప్పుడూ పోరాటాలు చేస్తూనే ఉండాలన్న సమంత..
actress samantha emotional comments on her breakup with Naga chaitanya
జీవితం చాలా పెద్దదని తెలుసుకోవాలని సూచించింది.తాను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుంచి తాను విడిపోయాక పర్సనల్ గా కుంగిపోతూ చాలా బలహీన పడ్డానని అన్నారు. ఒకానొక సమయంలో చనిపోతాననే అనుకున్నానంటూ.. ప్రస్తుతం తాను ధైర్యంగా ఉన్నానని తెలిపింది. ఇవే కాక విడాకుల అనంతరం తర్వాత తన జీవితంపై వస్తోన్న ట్రోలింగ్‌లకు కూడా సమంత స్పందించింది. ఎవరికి వారు రకరకాల అభిప్రాయాలతో ఉంటారన్న సమంత.. మనం ఒకరినొకరం ప్రేమించుకోవచ్చని.. అయితే వారి అభిప్రాయాలు హుందాగా వ్యక్తం చేయాలని కోరుకుంటానని తెలిపింది. ఏదీ ఏమైనప్పటికీ కొన్ని విషయాలు డైరక్ట్ గాను మరి కొన్ని ఇన్ డైరెక్ట్ గాను చెప్పిన సమంత.. లోపల ఎంతో బాధను దాచుకుని ఉందని తెలుస్తోంది.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.