Home » Entertainment » Actress Sneha Family Varalakshmi Pooja Celebration Pics
Entertainment

Actress Sneha : హీరోయిన్ ఫ్యామిలీ ఎంత క్యూట్‌గా ఉందో.. వరలక్ష్మీ పూజలో స్నేహ సందడి

Authored By
aruna
The Telugu News | Published on: August 16, 2022, 8:00 pm
Advertisement

Actress Sneha : హీరోయిన్ స్నేహ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అచ్చమైన తెలుగమ్మాయిలా, పదహరాణాల తెలుగు ఆడపడుచులా ఉంటుంది. ఆమె నటించిన చిత్రాలు కూడా అలానే ఉండేవి. ఎక్కడా కూడా ఎక్స్‌పోజింగ్‌కు తావిచ్చేది కాదు. మోడ్రన్ పాత్రల్లో నటించినా కూడా దుస్తులు మాత్రం అభ్యంతరకరంగా వేసుకునేది కాదు. అలా కోలీవుడ్, టాలీవుడ్లో స్నేహకు మంచి పాపులారిటీ వచ్చింది. బాపు వంటి గొప్ప దర్శకుల కంట్లో పడింది. రాధా గోపాలం అనే సినిమాలో కొత్త స్నేహను చూస్తారంతా.

Advertisement

ఇక స్నేహ ప్రేమ, పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ హీరో ప్రసన్నతో స్నేహ ప్రేమ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి ప్రేమ కథ కాస్త విభిన్నంగా ఉంటుంది. మొదట్లో ఈ ఇద్దరూ ఒక సినిమా కోసం పని చేశారు. ఆ సమయంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు మాట్లాడుకునే వారు కూడా కాదట. అయితే తరువాత తరువాత ఈ ఇద్దరి ప్రేమ స్నేహం మొదలైందని, అదే క్రమక్రమంగా ప్రేమగా మారిందని, ఇంట్లో చెబితే ఒప్పుకున్నారంటూ తమ ప్రేమ, పెళ్లి గురించి స్నేహ చెప్పుకొచ్చింది.

Actress Sneha Family Varalakshmi Pooja Celebration Pics

Advertisement

స్నేహ, ప్రసన్నలకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు, తన భర్త, తాను కలిసి యాడ్స్‌లో నటిస్తుంటుంది స్నేహ. అలా ఫ్యామిలీ అంతా కూడా ప్రకటనల ద్వారా సంపాదించేస్తుంటారు. మొత్తానికి స్నేహ మాత్రం ఇప్పుడు తెలుగు వారికి సెకండ్ ఇన్నింగ్స్‌తో పరిచయం అవుతోంది. వినయ విధేయ రామ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించింది. కానీ ఆసినిమా అంతగా వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ డైలామాలో పడింది. స్నేహ ఇప్పుడు సినిమాలకు దూరంగానే ఉంటుంది. కనీసం బుల్లితెరపైనా ట్రై చేయడం లేదు.

కానీ నెట్టింట్లో మాత్రం స్నేహ తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలికి సంబంధించిన ఫోటోలు, పిల్లల విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఇంట్లో జరిగిన వరలక్ష్మీ పూజకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో స్నేహా ఫ్యామిలీ ఎంతో అందంగా, సంప్రదాయబద్దంగా కనిపించింది. స్నేహా ఫ్యామిలీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి