Home » Entertainment » Adipurush Movie Effect In Bollywood
Entertainment

Adipurush Movie : ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్ .. ఆదిపురుష్ నామస్మరణ తో మారుమోగుతోన్న బాలీవుడ్ – ఏం జరిగిందో చూడండి !

Authored By
aruna
The Telugu News | Updated on: June 13, 2023 3:27 pm
Advertisement

Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించాడు. అయితే ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు ఎంతో మంచి మనసు చేసుకుని ముందుకు వస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ఆదిపురుష్ సినిమా 10 వేల మంది అనాధ పిల్లలకు చూపించబోతున్నట్టుగా ప్రకటించి టికెట్లు కూడా బుక్ చేశారు.

Advertisement

ఇప్పుడు ఆయన బాటలోనే ప్రముఖ గాయని అనన్య బిర్లా కూడా ఏకంగా 10,000 టికెట్లు బుక్ చేసి పిల్లల సేవా సంస్థలు మరియు అనాధాశ్రమాలకి అందించబోతుంది. ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తె అయిన కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా ఇటీవల బాలీవుడ్ లో సింగర్ గా బిజీ అయ్యారు. సింగర్ గా అనన్య బిర్లా మంచి పేరును దక్కించుకున్నారు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా యొక్క టికెట్లు పది వేల మందికి అందించడం ద్వారా ఆమె మంచితనం చాటుకున్నారు. ఆదిపురుష్ సినిమాను కేవలం రణ్బీర్ కపూర్, అనన్య బిర్లా మాత్రమే కాదు చాలామంది చూపిస్తాం అని ముందుకు వస్తున్నారు.

Adipurush Movie effect in bollywood

Advertisement

ఆదిపురుష్ సినిమాపై బాలీవుడ్లో మామూలు అంచనాలు లేవు. ఇటీవల శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ కూడా ఖమ్మం జిల్లాలోని అన్ని రామాలయాలలో 101 టికెట్లను ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదలకి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే చాలామంది ఈ సినిమా టికెట్లను ఉచితంగా అందిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో ఇంకెంతమంది సినిమా టికెట్లను ఫ్రీగా ఇస్తారో చూడాలి. ఏది ఏమైనా రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని, ప్రభాస్ కి ఇది కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలవాలని కోరుకుందాం.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి