Adipurush : ఆదిపురుష్ .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా. రాముని పాత్రలో ప్రభాస్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం షూట్ ఈరోజే ముంబైలో మొదలయ్యినట్టుగా ప్రభాస్. డైరెక్టర్ ఓంరౌత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆదిపురుష్ సినిమాకి సంబంధించి పలు రకాల వార్తలు వస్తూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం సినిమా కంప్లీట్ అవడం తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దృష్ఠిపెట్టాడు ప్రభాస్. ఈ క్రమంలోనే రీసెంట్ గా సలార్ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు.
adipurush-started-prabhas-revealed-himself
కాగా తాజాగా దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో అన్నీ ప్రధాన భాషల్లో తెరకెక్కనున్న ఆదిపురుష్ సెట్స్ మీదకి వచ్చింది. సలార్ తో పాటు ఆదిపురుస్ సినిమాని ఒకేసారి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు ప్రభాస్. ఇక ఈ సినిమాలో నటించే సీత .. లక్ష్మణ పాత్రల్లో ఎవరు నటించబోతున్నారో త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. దాదాపుగా ఆదిపురుష్ లో నటించే సీత కృతి సనన్ అని ముంబై మీడియా తో పాటు టాలీవుడ్ లో కూడా వినిపిస్తోంది.
ఇక ఆదిపురుష్ 2022 ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘ఆదిపురుష్’ ఆరంభ్ అంటూ పోస్టర్ ని రిలీజ్ చేసి క్రేజీ అప్‌డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక సలార్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ సినిమా కూడా ఈ ఏడాది ద్వితీయార్థం లో సెట్స్ మీదకు రానుంది.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.