Pagal : పాగల్ సినిమా ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు దర్శక, నిర్మాతలు. ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఫలక్ నుమా దాస్ సినిమాతో విశ్వక్ సేన్ టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ కెరీర్ లో 5 వ సినిమాగా పాగల్ తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్ నటించే సినిమాలకి టైటిల్ చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఆ టైటిల్స్ తోనే సినిమా మీద బాగా బజ్ క్రియేట్ అవుతోంది. ఒకరకంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కే సినిమాలకు ఆయన పెట్టే టైటిల్స్ మాదిరిగానే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమాలై టైటిల్స్ పెడుతున్నారు.
pagal-first-look-and-release-date-april-30
ఈ క్రమంలో తాజాగా రూపొందుతున్న పాగల్ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. చెప్పాలంటే పాగల్ పోస్టర్ తో ఒక స్టార్ హీరో సినిమాకి వచ్చినంత క్రేజ్ వచ్చేసింది. కాగా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తుండటం విశేషం. నరేష్ కొప్పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ అండ్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ నుంచి వచ్చిన సినిమాలన్ని మాస్ ఆడియన్స్ ని బాగా మెప్పించాయి. ఆ సినిమాలకి డబుల్ జోష్ ఉండేలా పాగల్ సినిమా రూపొందుతోంది.
కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు నిత్మాత దిల్ రాజు బృందం. ఏప్రిల్ 30 న గ్రాండ్ గా విశ్వక్ సేన్ పాగల్ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. కాగా ఈ తాజా పోస్టర్ చూసిన సినీ ప్రముఖులు విశ్వక్ సేన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్యారెంటీగా పాగల్ సినిమా సూపర్ హిట్ అంటూ నమ్మకాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే విశ్వక్ సేన్ గత చిత్రాలకంటే పాగల్ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. చూడాలి మరి పెద్ద సినిమాల తో పాటుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సస్ అందుకుంటుందో.
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
This website uses cookies.