Jr NTR : అల్లు అర్జున్ అయ్యాడు.. ఇప్పుడు ఎన్టీఆర్.. మాకు ఎలాంటి సహాయం చేయలేదు అభిమాని తల్లి ఆవేదన ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : అల్లు అర్జున్ అయ్యాడు..  ఇప్పుడు ఎన్టీఆర్.. మాకు ఎలాంటి సహాయం చేయలేదు అభిమాని తల్లి ఆవేదన ! 

 Authored By ramu | The Telugu News | Updated on :23 December 2024,8:02 pm

ప్రధానాంశాలు:

  •  Jr NTR : అల్లు అర్జున్ అయ్యాడు..  ఇప్పుడు ఎన్టీఆర్.. మాకు ఎలాంటి సహాయం చేయలేదు అభిమాని తల్లి ఆవేదన ! 

Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని చెబుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ చుట్టూ ఈ కేసు విషయమై ఉచ్చు బిగుస్తుంది అనిపిస్తుంది. పోలీసులు మహిళ చనిపోయిన విషయం అల్లు అర్జున్ కి చెప్పినా అతను మాత్రం నెక్స్ట్ డే ఆ విషయం తెలిసిందని అన్నాడు. ఐతే ఈ విషయంపై అల్లు అర్జున్ ని వదిలి పెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఐతే అల్లు అర్జున్ ఇష్యూ నడుస్తున్న ఈ టైం లో ఎన్ టీ ఆర్ మాకు హామీ ఇచ్చాడు కానీ సాయం చేయలేదని ఒక తల్లి ఆవేదనగా మీడియా ముందుకు వచ్చింది. దేవర రిలీజ్ ముందు ఎన్ టీ ఆర్ అభిమాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్ టీ ఆర్ తో మాట్లాడాలన్న అభిమాని కోరిక ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఐతే ఆ టైం లోనే దేవర చూడాలని ఉందన్న అభిమాని కోరిక విన్నాడు తారక్.

Jr NTR అల్లు అర్జున్ అయ్యాడు ఇప్పుడు ఎన్టీఆర్ మాకు ఎలాంటి సహాయం చేయలేదు అభిమాని తల్లి ఆవేదన

Jr NTR : అల్లు అర్జున్ అయ్యాడు..  ఇప్పుడు ఎన్టీఆర్.. మాకు ఎలాంటి సహాయం చేయలేదు అభిమాని తల్లి ఆవేదన !

Jr NTR అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్..

అంతేకాదు ఆ అభిమాని ట్రీట్ మెంట్ కి తాను ఆర్ధిక సాయం అందిస్తానని అన్నాడు. ఐతే ఎన్టీఆర్ ఆ టైం లో అలా చెప్పాడు కానీ తమకు ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని అభిమాని తల్లి లేటెస్ట్ గా మీడియా ముందుకొచ్చారు. చెన్నైలో అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పూర్తైంది.. బాబుకి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఐతే అక్కడ ఇంకా 20 లక్షలు బిల్ పెండింగ్ ఉందని ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు కానీ అతని నుంచి ఎలాంటి సాయం అందలేదని దయచేసి మాకు సాయం చేయాలని అభిమాని తల్లి మీడియా ద్వారా విన్నవించుకుంది.

ఫ్యాన్సే మా ప్రాణం.. వారి ఆనందం కోసమే సినిమాలు తీస్తున్నాం అని చెప్పే హీరోలు. వారిని మెప్పించేందుకు అప్పటికప్పుడు ఏదైనా హామీ ఇచ్చేస్తారు కానీ వాటిని నెరవేర్చరు అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఐతే ఎన్ టీ ఆర్ అండ్ టీం కి అభిమాని తల్లి చేస్తున్న ఈ అభ్యర్ధన వారి దాకా చేరితే వెంటనే వారిని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. Allu Arjun, Jr NTR, Devara, Jr NTR fan, Tollywood

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది