Manchu vishnu Kannappa : కన్నప్ప మీద కల్కి ఎఫెక్ట్.. తేడా కొడితే మాత్రం మంచు విష్ణు ట్రోల్స్ కి బలవ్వక తప్పదు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 3 July 2024, 11:00 am
  •  Manchu vishnu Kannappa : కన్నప్ప మీద కల్కి ఎఫెక్ట్.. తేడా కొడితే మాత్రం మంచు విష్ణు ట్రోల్స్ కి బలవ్వక తప్పదు..!

Manchu vishnu Kannappa : ప్రభాస్ కల్కి వచ్చి చాలా సినిమాలకు రెడ్ అలర్ట్ ప్రకటించాడు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రతి హీరోకి అసలు సిసలు పాన్ ఇండియా బొమ్మ ఇదే అంటూ కల్కితో సంచలనాలు సృష్టిస్తున్నాడు. కల్కి సినిమా ప్రభాస్ మాస్ స్టామినా మరోసారి ప్రూవ్ చేస్తుంది. ఐతే ఈ సినిమా చూసిన వారంతా ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కల్కిలో ప్రధానమైన అంశాల్లో ప్రభాస్ మొదటి వాడుగా చెప్పొచ్చు. అఫ్కోర్స్ అమితాబ్, కమల్ హాసన్, దీపికా వారి ఎఫర్ట్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.

ఐతే కల్కి సినిమా చూసిన ఆడియన్స్ అంతా రాబోతున్న పాన్ ఇండియా సినిమాల గురించి ఆలోచిస్తూ రాబోతున్న కన్నప్ప మీద ఫోకస్ పెట్టారు. మంచు విష్ణు టైటిల్ రోల్ లో ముఖేష్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప సినిమాను మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ఇలాన్ తారాగణం చాలా పెద్దగానే ఉంది. ఇలాంటి స్టార్ కాస్ట్ తో కన్నప్ప భారీ అంచనాలను ఏర్పరచుకుంది.

Manchu vishnu Kannappa టీజర్ తో నిరాశపరచిన కన్నప్ప

ఐతే అంచనాలు ఎంతగా ఉన్నాయో కన్నప్ప టీజర్ అంత నిరాశపరచింది. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ సినిమాపై ఉన్న ఆశలన్నీ ఆవిరి చేసింది. మంచు విష్ణు చేస్తున్న ప్రాజెక్ట్ పెడుతున్న ఎఫర్ట్ గొప్పగానే ఉన్నా అవుట్ పుట్ మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదని టీజర్ చూసే అర్ధమవుతుంది. కన్నప్ప టీజర్ ని ఆడియన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకున్నారు.

Manchu vishnu Kannappa : కన్నప్ప మీద కల్కి ఎఫెక్ట్.. తేడా కొడితే మాత్రం మంచు విష్ణు ట్రోల్స్ కి బలవ్వక తప్పదు..!

Manchu vishnu Kannappa : కన్నప్ప మీద కల్కి ఎఫెక్ట్.. తేడా కొడితే మాత్రం మంచు విష్ణు ట్రోల్స్ కి బలవ్వక తప్పదు..!

ఇక సినిమా కూడా ఇలానే ఉంటే సోషల్ మీడియా ట్రోల్స్ కి మంచు విష్ణు బలవ్వక తప్పదు. తను చేస్తున్న సినిమా గొప్పదే కానీ ఆ ఎఫర్ట్స్ ఇంకా సరిపోలేదు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. సినిమా అక్కడ చేశాం ఇక్కడ చేశాం అని గొప్పలు చెప్పడం కాదు సినిమా ఆడియన్స్ మనసులు గెలిచేలా ఇంపాక్ట్ కలుగచేస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. కల్కి చూసిన ఆడియన్స్ కన్నప్ప చూసి కచ్చితంగా అదేమైనా తేడా కొడితే మాత్రం ఘోరంగా ఆడేసుకునే ఛాన్స్ ఉంది. మరి వాళ్లకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మంచు విష్ణు జాగ్రత్త పడితే బెటర్ అని చెప్పొచ్చు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి