Aishwarya Rai – Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారా ??

 Authored By prabhas | The Telugu News | Updated on :9 April 2023,9:00 am

Aishwarya Rai – Abhishek Bachchan : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి సెలబ్రిటీల విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక సెలబ్రిటీ విడాకులు తీసుకున్నారు అని తెలియగానే వరుసగా విడాకుల వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన వార్తల్లో చాలావరకు ఫేక్ గా ఉన్నాయి. ఇక తాజాగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Aishwarya Rai break up with Abhishek Bachchan

Aishwarya Rai break up with Abhishek Bachchan

వీటికి కారణాలు కూడా లేకపోలేదు. ఈమధ్య ఐశ్వర్య ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్ కు వెళ్ళినా సరే కేవలం తన కూతురితో కలిసి మాత్రమే వెళుతుంది. అంతకు ముందు మాత్రం ఆమె ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా భర్తతో కలిసి వెళ్ళేది. అయితే కొన్ని రోజులుగా భర్తతో ఆమెకు పడట్లేదని, అందుకే కూతురుతో కలిసి వెళ్తుందని న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో బాలీవుడ్ మీడియాలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల విడాకుల విషయం గురించి జోరుగా ప్రచారం కొనసాగుతుంది. అయితే తాజాగా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు అభిషేక్ బచ్చన్.

Trouble in Aishwarya Rai, Abhishek Bachchan's marriage?

తాజాగా నీతూ అంబానీ ఏర్పాటుచేసిన కల్చరల్ ఈవెంట్ కు ఐశ్వర్యరాయ్ తన కూతురుతో కలిసి వెళ్ళింది. అయితే వీళ్ళిద్దరి ఫోటోలను అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకి ట్యాగ్ కూడా తగిలించాడు. ఐశ్వర్య తన కూతురితో కలిసి దిగిన ఫోటోకు మై ఫేవరెట్ పీపుల్స్ అంటూ పోస్ట్ రాసుకొచ్చాడు. దీంతో వీళ్లిద్దరూ విడాకులకు చెక్ పడినట్లు అయింది. ఐశ్వర్యతో విడాకులు తీసుకోవడం లేదని అభిషేక్ బచ్చన్ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు అన్నమాట. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకోవడం లేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి