Anikha Surendran : హీరోయిన్ లుక్‌తో అదరగొట్టిన అజిత్ కూతురు.. చిన్న పిల్ల అనుకుంటే పొరపాటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anikha Surendran : హీరోయిన్ లుక్‌తో అదరగొట్టిన అజిత్ కూతురు.. చిన్న పిల్ల అనుకుంటే పొరపాటే?

Anikha Surendran : సినిమా ఇండస్ట్రీలోకి కొత్తతరం రయ్యుమంటూ దూసుకొస్తుంది. చదువుకుంటూనే సినిమాల్లో బాల నటులుగా అలరిస్తున్న నేటితరం యువత..చాలా త్వరగా సినిమాల్లో హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. హీరోలు మాత్రం కాస్త ఆలస్యంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండగా.. అమ్మాయిలు మాత్రం 17 ఏళ్లకే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చెలామణి అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కోవలోకి వస్తుంది అజిత్ సినిమాలో అతనికి కూతురిగా నటించిన అనికా సురేంద్రన్.. Anikha Surendran : తారాజువ్వలా మొహం వెలిగిపోతుందిగా.. ఈ అమ్మాయి ప్రస్తుతం […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 September 2022,6:30 pm

Anikha Surendran : సినిమా ఇండస్ట్రీలోకి కొత్తతరం రయ్యుమంటూ దూసుకొస్తుంది. చదువుకుంటూనే సినిమాల్లో బాల నటులుగా అలరిస్తున్న నేటితరం యువత..చాలా త్వరగా సినిమాల్లో హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. హీరోలు మాత్రం కాస్త ఆలస్యంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండగా.. అమ్మాయిలు మాత్రం 17 ఏళ్లకే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చెలామణి అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కోవలోకి వస్తుంది అజిత్ సినిమాలో అతనికి కూతురిగా నటించిన అనికా సురేంద్రన్..

Anikha Surendran : తారాజువ్వలా మొహం వెలిగిపోతుందిగా..

ఈ అమ్మాయి ప్రస్తుతం చాలా పెద్దది అయ్యింది. తన తర్వాతి టార్గెట్ హీరోయిన్‌ అని టాక్ వినిపిస్తోంది. రానున్న రెండేళ్లలో తప్పకుండా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోందట అనికా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఈ అమ్మాయి గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే నేటికి అనికా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అజిత్ నటించిన ‘విశ్వాసం’ ,‘ఎంత వాడు గానీ’ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇందులో హీరో కూతురిగా అనికా నటించిన విషయం తెలిసిందే. ఈ యాక్టర్ బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అనికా చిన్న పాప నుంచి పెద్దపాపకు ప్రమోషన్ తీసుకుంది.

Ajith Daughter Anikha Surendran Heroine Chance

Ajith Daughter Anikha Surendran Heroine Chance

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనికా..తన లేటెస్ట్ ఫోటోలను అప్లోడ్ చేసింది. ప్రస్తుతానికి తనకి హీరోయిన్ ఛాన్స్ రానప్పటికీ లేటెస్ట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది అనికా.. హాట్ అందాలను కూడా చూపిస్తోంది. మూడేళ్ల వ‌య‌స్సులోనే బాల‌న‌టిగా చోటా ముంబై అపూ అనే మ‌లయాళ చిత్రంలో నటించగా ఆ సినిమా ఆమెకు పెద్ద పేరు తీసుకురాలేదు. 2010లో వచ్చిన తుదారున్నులో మూవీలో న‌టించి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. అనంతరం బాల‌న‌టిగా మ‌ల‌యాళంలో వ‌రుస అవ‌కాశాలు వచ్చాయి. తాజాగా తెల్లని చీరలో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఆమె పిక్స్‌కు లైక్స్ కొడుతున్నారు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది