Home » Entertainment » Akhil Akkineni Fan On Sudigali Sudheer In Sridevi Drama Company
Entertainment

Sudigali Sudheer : అయ్యగారే నెంబర్ వన్.. సుడిగాలి సుధీర్‌ను ఆడేసుకున్నారుగా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 18, 2022 12:54 am
Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా దూసుకుపోతోన్నాడు. అలా సుధీర్‌కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఇక సుధీర్ ఫ్యాన్స్ అయితే నెట్టింట్లో హంగామా చేస్తుంటారు. యూట్యూబ్‌లో సుధీర్ ఫ్యాన్స్ హంగామానే కనిపిస్తుంటుంది. తాజాగా సుధీర్ హోస్ట్ చేస్తోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు సంబంధించిన ప్రోమో టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్‌ను రకరకాలుగా ఆడుకున్నారు.అయ్యగారే నెంబర్ వన్.. ఆడే కరెక్ట్..

Advertisement

అఖిలే నెంబర్ వన్ అంటూ ఓ తాగుబోతు ఫ్యాన్ ఎంతగా వైరల్ అయ్యాడో అందరికీ తెలిసిందే. నిజంగా చెప్పాలంటే.. అఖిల్‌కంటే ఈ అయ్యగారికే ఎక్కువ క్రేజ్ ఉంటుంది నెట్టింట్లో. మీమ్స్, ట్రోల్స్‌లో అతగాడు బాగానే ఫేమస్ అయ్యాడు. అతడిని ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకి తీసుకొచ్చారు. ఇక వచ్చీ రావడంతోనే అయ్యగారే నెంబర్ వన్ అంటూ స్లోగన్ స్టార్ట్ చేసేశాడు. అలా సుధీర్ గురించి ఈ ఫ్యాన్ చెప్పేశాడు.ఈ ప్రోమో టీజర్ చూస్తుంటే ఈ సారి థీమ్ అంతా కూడా సుధీర్ చుట్టే తిరిగేలా ఉంది. ప్రతీ వారం ఒక్కో థీంతో వచ్చే శ్రీదేవీ డ్రామా కంపెనీ ఈ సారి ఈ అయ్యగారిని పట్టుకొచ్చింది.

Akhil Akkineni Fan On Sudigali Sudheer In Sridevi Drama Company

Advertisement

మరి ఇతడితో ఏం చేస్తుందో చూడాలి. అయితే ఈ ఎపిసోడ్‌లో సుధీర్‌ను అందరూ కలిసి ఆడేసుకుంటున్నారు. ఆది, రాం ప్రసాద్ వంటి వారు కలిసి సుధీర్‌ను ఏడిపిస్తున్నారు. ఇక చివర్లో అయ్యగారు అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. సుధీర్‌ను ఊరేగిస్తూ ఉండగా చివరకు అఖిలే నెంబర్ వన్ అని అనేశాడు.చూశావారా? వీడు.. మనతోనే ఉన్నాడు.. చివర్లో అఖిలే నెంబర్ వన్ అని అనేశాడు అంటూ రాం ప్రసాద్ సెటైర్ వేయడంతో ఆది, సుధీర్ నవ్వేశారు. మొత్తానికి ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ కాస్త వెరైటీగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి