akhil sarthak fire on sunny
Akhil Sarthak : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం విజేత సన్నీఇటీవల వివాదాలతో తెగ వార్తలలో నిలుస్తున్నాడు. ఆయన తాజగా స్టేజ్‌పైన సోహెల్ ని అవమానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా సన్నీ సకలగుణాభిరామ చిత్రంలో నటించగా, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీజే సన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గెలుస్తాడనుకుంటే నాల్గో సీజన్‌లో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేశావంటూ సోహైల్ గురించి చులకనగా మాట్లాడాడు.బిగ్ బాస్ నాలుగో సీజన్ లో సోహెల్ గెలుస్తాడు అని అనుకున్నాను. కాని డబ్బులు తీసుకుని వచ్చేశిండు.
నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా’ అని గర్వంగా చెప్పుకొచ్చాడు సన్నీ. అయితే అత్యుత్సాహంపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. సన్నీ కామెంట్స్ పై అఖిల్ పరోక్షంగా స్పందించాడు. సన్నీ పేరు తీయకుండానే అతడిపై మండిపడ్డాడు.’ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది!’
akhil sarthak fire on sunny
అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్ట్ డిలీట్ చేశాడు.బిగ్ బాస్ ఫేమ్ విజే సన్నీ హీరోగా తెరకెక్కిన సినిమా సకల గుణాభిరామ. నర్వాల్, తరుణీ హీరోయిన్లుగా వెలిగొండ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి, మాస్‌కాదాస్ విశ్వక్ సేన్ హాజరయ్యారు. అంతే కాదు ఈ ట్రైలర్ లాంచ్ లో సన్నీ క్లోజ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఫేమ్ మానస్, వరుణ్ సందేశ్‌లు కూడా సందడి చేశారు.
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
This website uses cookies.