Niharika : నిహారిక జీవితం ఇలా అవ్వడానికి కారణం అక్కినేని అఖిల్ నా.. !! ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!
Niharika : సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాలో పాత్ర ఒకరి కోసం రాసుకుంటే దానిని మరొకరు చేస్తూ ఉండడం సర్వసాధారణం. చాలామంది సెలబ్రిటీలు ఇలా మంచి మంచి స్టోరీస్ ను మిస్ చేసుకున్న వాళ్ళను చూసాం. అయితే రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా అలాంటి మంచి పాత్రను మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అభిమానులకు అది షాకింగ్ గా అనిపిస్తుంది. అంతా మంచి అవకాశం ఎలా మిస్ అయిపోయావు అంటూ బాధపడుతున్నారు. నిజానికి నిహారిక పుట్టగానే ఒక పెద్ద ప్రాజెక్టులో భాగం కావాల్సి ఉందట. నీహారిక పుట్టిన తర్వాత సిసింద్రీ సినిమా షూట్ ను ప్రారంభించారు. ఈ సినిమా సమయంలో చిత్ర యూనిట్ ఒక పాప గాని బాబు గాని పాకుతూ ఉండే స్టేజ్లో బేబీ కావాలి అంటూ బాగా ఎక్కువగా ట్రై చేశారట.
స్టార్ సెలబ్రిటీల పిల్లలు అయితే సినిమాకి మరింత హైప్ వస్తుందని అలాంటి వాళ్ల కోసం ట్రై చేశారట. అప్పటికే నిహారికకు 8 నెలలు దాటిపోయాయి. జనరల్ గా ఎనిమిది నెలలు దాటేసరికి పిల్లలు పాకుతూ ఉంటారు కానీ నిహారిక చాలా యాక్టివ్ గా ఉండేదట. ఎనిమిది నెలలకు గోడ పట్టుకొని ఏకంగా నడిచేసేదట. అయితే సిసింద్రీ సినిమాకి అంత యాక్టివ్ గా ఉండే పిల్లలు వద్దని పాకుతూ ఉండే బేబీ కోసం ట్రై చేశారట. ఇక అప్పుడే అక్కినేని నాగార్జునకు అఖిల్ పుట్టడం, అఖిల్ ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోవడంతో మేకర్స్ అఖిల్ ను ఎంచుకున్నారట. అలా సిసింద్రీ సినిమా నిహారిక నుంచి అఖిల్ ఖాతాలోకి వెళ్లిపోయింది.
ఒకవేళ నిజంగానే నిహారిక చిన్నప్పుడు ఆ పాత్రలో కనిపించి ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయేది అని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఏంటో నిహారిక టైం అసలు బాగోలేదు. అన్ని వచ్చినట్లే వచ్చి చేయి జారిపోతున్నాయి. నిహారిక లైఫ్ ఇలా ఎందుకు అవుతుందో అని అభిమానులు బాధపడుతున్నారు. అటు హీరోయిన్గా నిహారిక సక్సెస్ కాలేదు. ఇటు వ్యక్తిగతంగా కూడా ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఎంతో ఘనంగా జొన్నలగడ్డ చైతన్య తో వివాహం చేసుకున్న నిహారిక కొద్ది రోజులకే విడిపోవడం అందరికీ ఆశ్చర్యం గా అనిపించింది. ఇక ఇప్పుడిప్పుడే ఆ సమస్యల నుంచి బయట పడుతూ ప్రొడ్యూసర్ గా తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో కూడా నిర్మాతగా వ్యవహరించారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.