Akkineni Amala comments about Samantha divorce matter
Amala : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సమంత ఆ సినిమా టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళింది. ఇద్దరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ జీవితాంతం కలిసి ఉండలేకపోయారు. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి వీడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళ విడాకులు గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.
విడాకులు తీసుకున్న విషయం సమంత నాగచైతన్య మర్చిపోయిన నెటిజెన్లు మాత్రం అస్సలు మర్చిపోవడం లేదనిపిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య విడాకుల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వీళ్ళిద్దరి విడాకులు విషయం గురించి ఓ వార్త వచ్చింది. రీసెంట్ గా అక్కినేని అమల ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య మీద వచ్చే నెగటివ్ కామెంట్స్ పై ఆమె స్పందించారు. సెలబ్రిటీ జీవితం అన్న తర్వాత మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం సహజం. దానిని మనం మార్చలేము, సమంత మరియు నాగచైతన్య విడాకులు ఏమి సీక్రెట్ గా జరగలేదు పబ్లిక్ గానే జరిగాయి.
మరి దీని గురించి నెటిజన్స్ అభిప్రాయాలు స్వీకరించడం కూడా మన బాధ్యత. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను నేను స్వాగతిస్తాను అంటూ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా సుమంత నాగచైతన్య విడాకులు తీసుకొని చాలా రోజులవుతున్నప్పటికి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వాటిపై నెటిజన్ లు వివిధ రకాలుగా స్పందిస్తూనే ఉంటున్నారు. ఇకపోతే సమంత నాగచైతన్య తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాడు. ఇక సమంత బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.