Home » Entertainment » Akkineni Heroes Plans Pan India Movies
Entertainment

Akkineni : పాన్ ఇండియా సినిమాలు చేయ‌లేక‌పోతున్న అక్కినేని హీరోలు.. నిరాశ‌లో అభిమానులు

Authored By
Sam C
The Telugu News | Updated on: April 4, 2022 8:13 pm
Advertisement

Akkineni : ఇప్పుడు సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మ‌న సినిమాలు నార్త్‌లో కూడా సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో పెద్ద హీరోలే కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి కుర్ర హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మార‌గా, తర్వాత బ‌న్నీ, ఇక రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్‌గా మారారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌వితేజ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే అక్కినేని హీరోలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయ‌లేక‌పోతున్నార‌నే నిరాశ అభిమానుల‌లో ఉంది. బ్రహ్మాస్త్ర లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ నాగ్ నటించారు.

Advertisement

ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. నాగచైతన్య ఇప్పుడు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తోక‌లిసి లాల్ సింగ్ చ‌ద్దా అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించాడు. ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సాధిస్తే పాన్ ఇండియా సినిమాల్లో నటించిన హీరోలుగా అక్కినేని హీరోలకు పేరొస్తుందినాగ‌ చైతన్య స్థిరంగా విజయాలు అందుకుంటూ ప్రస్తుతానికి ప్రాంతీయ మార్కెట్ పైనే దృష్టి సారించాడు. తదుపరి తమిళంలోనూ రాణించే ఆలోచన ఉంది.ప్రస్తుతం వెబ్ సిరీస్ లపైనా దృష్టి సారించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని ప్రయోగాలు చేస్తున్నాడు. అక్కడ సక్సెసైతే నెమ్మదిగా పాన్ ఇండియా మేకోవర్ పైనా దృష్టి సారిస్తాడని భావించవచ్చు.

akkineni heroes plans pan india movies

Advertisement

Akkineni : పాన్ ఇండియ‌పై గురి..

అఖిల్ ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో అఖిల్‌ బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడట.ఇకపై వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలను ఎంచుకోవాలని అఖిల్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. 2022లో విడుదల కానున్న అనేక భారీ చిత్రాల్లో బ్రహ్మాస్త్ర- లాల్ సింగ్ చద్దా పై భారీ అంచనాలున్నాయి. అలాగే పృథ్వీరాజ్.. లాల్ సింగ్ చద్దా.. విక్రమ్ వేద.. సర్కస్ .. రామ్ సేతు లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ ఆర్.ఆర్.ఆర్ నింపిన స్ఫూర్తితో విజయం సాధిస్తాయని భారీ వసూళ్లను అందుకుంటాయని ఆశిస్తున్నారు. అయితే అక్కినేని అభిమానులు త‌మ హీరోలు కూడా పాన్ ఇండియా చిత్రాలు చేయాల‌ని కోరుకుంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి