Ali : పెద్దావిడ ఒక‌రు ఉండేది… క‌న్నాంబ త‌ర్వాత ఈమె.. సుమ ప‌రువుదీసిన అలీ..!

Authored By mallesh | The Telugu News | Published on: October 3, 2021, 6:45 pm

Ali : సీనియర్ నటుడు బ్రహ్మాజీ, కమెడియన్ ఆలీ ఓ విషయంలో తలపడబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ తలపడబోతున్నట్లుగా వీరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు. అది ఎక్కడంటే..ప్రతీ ఆదివారం స్టార్ మాలో ప్రసారమయ్యే సరాదా సమయం ‘స్టార్ట్ మ్యూజిక్’ ప్రోగ్రాంకు ఆలీ, బ్రహ్మాజీ అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా షోలో ‘ఆర్ఆర్ఆర్’ ‘దోస్తీ’ బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు.

Ali coments on suma

Ali coments on suma

Ali : ఇండస్ట్రీకి పెద్ద దిక్కు సుమ..

ఈ షోకు సుమ యాంకర్ కాగా, ఆమెపై పంచులు వేసి ఆలీ, బ్రహ్మాజీ షోలో ఆనందంగా టాస్కులు పూర్తి చేసినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ఇన్ స్టా గ్రామ్ వేదికగా విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్‌లో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకరి చేతులను మరొకరు పట్టుకుని స్టిల్ ఇచ్చిన మాదిరిగా ఆలీ, బ్రహ్మాజీ స్టిల్ ఇచ్చారు. అది చూసి సుమ నవ్వుకుంది. ఇకపోతే సుమ నటుడు బ్రహ్మాజీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయనకొక కురువృద్ధుడని, భీష్మాచార్యుల వంటి వారని చెప్పింది.

Anchor Suma Fun In Maldives Five Star Hotel

Anchor Suma Fun In Maldives Five Star Hotel

అంతకు ముందర ఆలీ, బ్రహ్మాజీ షోలో మాట్లాడుతూ ఓ పెద్దావిడ ఉండేది కన్నంబ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఆవిడే పెద్ద దిక్కు అని సుమను ఉద్దేశించి చెప్పారు. ఆ మాటలు విని సుమ నవ్వుకోవడంతో పాటు కౌంటర్ అటాక్ ఇచ్చేసింది. ఇకపోతే సుమ బ్రహ్మాజీ గురించి చెప్పబోతున్న క్రమంలో ఆలీ జోక్యం చేసుకుని కాడెద్దులో ఒక ఎద్దు బ్రహ్మాజీ అని చెప్పు నవ్వులు పూయించారు. మొత్తంగా ప్రోమోను చూస్తే చాలా ఎంటర్‌టైనింగ్‌గా షో జరిగినట్లు అర్థమవుతున్నది. ఈ షో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతుంది. ఇకపోతే ‘స్టార్ట్ మ్యూజిక్’ ప్రోగ్రాం ప్రోమో చూసి నెటిజన్లు ఇంట్రెస్టింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ షో మాదిరిగా సెట్ ఉందని అభిప్రాయపడుతున్నారు.

comedian ali : కమెడియన్‌ ఆలీ ఆస్తుల విలువ మీకు తెలుసా?

comedian ali : కమెడియన్‌ ఆలీ ఆస్తుల విలువ మీకు తెలుసా?

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp