Home » Entertainment » Alia Bhatt Un Happy With Rajamouli
Entertainment

Alia Bhatt : రాజ‌మౌళిపై అలిగిన అలియా భ‌ట్.. అన్‌ఫాలో చేయ‌డంతో పాటు పోస్ట్‌లు అన్నీ డిలీట్ చేసిందిగా…!

Authored By
Sam C
The Telugu News | Published on: March 30, 2022, 9:30 pm
Advertisement

Alia Bhatt: టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు పోషించారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ చిత్రంతో అలియా భ‌ట్ దక్షిణాది సినీపరిశ్రమలో అడుగుపెట్టింది.

Advertisement

రాజమౌళి డైరెక్షన్ అనగానే రెండో ఆలోచన లేకుండా ఈ సినిమాకు అలియా ఓకే చెప్పేసింది. అయితే చివరకు ఆమెకు నిరాశ మాత్రమే మిగిలింది.ఎన్నో ఆశలతో ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన అలియాకు… స్క్రీన్ పై పెద్దగా స్పేస్ లేకపోయేసరికి షాక్ తగిలినట్టయిందట. దీంతో ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి రాజమౌళిని అన్ ఫాలో చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సంబంధించిన పలు పోస్టులను డిలీట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడకముందు నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అలియా చాలా ఉత్సాహంగా పాల్గొంది. విడుదల తేదీ ఖరారైన తర్వాత జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం ఏ మాత్రం యాక్టివ్ గా లేదు.

alia bhatt un happy with rajamouli

Advertisement

అంతేకాదు సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ… అలియా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. మరోవైపు బాలీవుడ్ లో ఎంతో స్టార్ డమ్ ఉండే అలియాకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే బాగుండేదని ఆమె అభిమానులు అంటున్నారు.ఇద్దరు బడా హీరోల కలయికలో వచ్చిన ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే, రివ్యూలు కూడా ఈ సినిమాకు మరింత బూస్ట్‌ను ఇచ్చాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి