Allu Aravind : అల్లు అరవింద్ ఇటీవల ఏం పట్టుకున్నా బంగారమే అవుతుంది. చేసిన ప్రతి పనిలో సక్సెస్ అవుతున్నాడు. నిర్మాతగా రాణిస్తూనే ఆహా అనే ఓటీటీ సంస్థని స్థాపించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా కన్నడ చిత్రం కాంతారా తెలుగు థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాడు.ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్ చేయకపోయిన కూడా సినిమాకు మౌత్ టాక్ అదిరిపోయింది. దీంతో కాంతారా సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కాంతారా సినిమా దెబ్బకు అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్‌లు షేక్ అవుతున్నాయి. తమిళం, హిందీ భాషల్లోనూ కాంతారా అదిరిపోయింది.
తెలుగులో అయితే మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయింది. రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం మొదటి రోజే.. రెండున్నర కోట్ల షేర్‌తో దుమ్ములేపేసింది. అలా మొదటి రోజే లాభాల బాట పట్టేసింది కాంతారా. అయితే విపరీతమైన మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూలతో కాంతారా సినిమా రేంజ్ మారిపోయింది. అల్లు అరవింద్ తెలుగు రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నారు. సెకండ్ డే కాంతార ఫస్ట్ డేకి మించి వసూలు చేసింది. రెండవ రోజు రూ. 2.85 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్ లో కాంతార 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ క్రమంలో రూపాయి పెట్టుబడితో అల్లు అరవింద్ పది రూపాయలు సంపాదించనున్నాడు.
మొత్తానికి మనోడికి అదృష్టం బాగానే ఉందని అంటున్నారు.కాంతారా సినిమా ఇప్పటి వరకు కన్నడలో వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకా అక్కడ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. 15 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కించిన కాంతారా ఆల్రెడీ వంద కోట్లను కొల్లగొట్టేసింది. ఇక ఇప్పుడు అన్ని భాషల్లోకి డబ్ అవ్వడంతో కలెక్షన్లు మరింతగా పెరుగుతున్నాయి. రిషభ్ శెట్టి టేకింగ్, యాక్టింగ్ ఈ సినిమాకు ప్రాణంగా మారాయి. మరీ ముఖ్యంగా కాంతారా సినిమా క్లైమాక్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనే ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. అక్కడే కాంతారా సక్సెస్ అయింది. కాంతారా సినిమాకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.