Allu Aravind : నువ్వు ఎవడ్రా.. ఇండస్ట్రీలో ఇలాంటి వాడు అస్సలు ఉండొద్దు.. సురేష్ కొండేటికి అల్లు అరవింద్ మాస్ వార్నింగ్ అదుర్స్
ప్రధానాంశాలు:
అది అతడి వ్యక్తిగత ఫెయిల్యూర్
దాన్ని తెలుగు ఇండస్ట్రీ మీదికి ఆపాదించకండి
ఈవెంట్ లో పక్కన నిలబడి ఫోటోలు దిగితే పీఆర్వోనేనా?
Allu Aravind : ప్రముఖ జర్నలిస్టు సురేశ్ కొండేటి గురించి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఒక వివాదంలో చిక్కుకున్నారు. సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ విషయమై ఈ వివాదం ఇండస్ట్రీలో రచ్చ రచ్చ అవుతోంది. ఈ విషయంపై తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఒక విషయం వివాదంలోకి వెళ్లింది. ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా తను అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఒకటి గోవాలో చేయాలనుకున్నారు. ఏదో కారణాల వల్ల చేయలేకపోయారు. అక్కడికి తీసుకెళ్లిన వాళ్లు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే మీడియా మాత్రం మా కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి గురించి ఆయన పీఆర్వో అంటూ రాశాయి. ఇవాళ పొద్దున చూసి ఆయన పీఆర్వో అని ఎప్పుడైనా చెప్పారా అఫిషియల్ గా అతడికి. ఎప్పుడైనా ఫోటోల్లో అతడి పక్కన కనబడుతుంటే.. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఫోటోలు దిగుతారు. వాటిని పట్టుకొని ఆయన పీఆర్వో అని రాయడం కరెక్ట్ కాదు అని అల్లు అరవింద్ మండిపడ్డారు.
అతడు తన వ్యక్తిగతంగా ఏదో చేసుకుంటూ అతడు ఫెయిల్ అయినందు వల్ల ఇతర పత్రికలు కానీ.. మీడియా కానీ.. వాటిని అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కొన్ని ఇతర భాషల వారికి ఇబ్బందులు పడ్డాయి. దాని వల్ల తెలుగు ఇండస్ట్రీని వాళ్లు బ్లేమ్ చేస్తున్నారు. ఇది వ్యక్తిగత విషయం. దానికి.. తెలుగు ఇండస్ట్రీకి ఏంటి సంబంధం. ఏదో తెలుగు ఇండస్ట్రీ ఇంతే.. తెలుగు ఇండస్ట్రీలో మనుషులు ఇంతే అని ఇతర భాషల వాళ్లు మాట్లాడటం కానీ.. కొన్ని పత్రికల్లో అవి రావడం కానీ.. ఇవాళ ఉదయం పత్రికల్లో చూసి బాధపడ్డా అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
Allu Aravind : అతడు ఎవ్వరికీ పీఆర్వో కాదు
ఇది ఒక వ్యక్తి చేసిన దానికి ఎవరికో దాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. దయచేసి వాళ్లందరికీ నా విన్నపం ఏంటంటే ఆయన ఎవ్వరికీ పీఆర్వో కాదు.. మా కుటుంబంలో ఎవ్వరికీ పీఆర్వో కాదు. అతడు ఇండస్ట్రీకి ఏదో ద్రోహం చేయాలని కాదు. అతడి పర్సనల్ ఫెయిల్యూర్. దాన్ని తెలుగు ఇండస్ట్రీ మీదికి తీసుకురావడం కరెక్ట్ కాదు అంటూ అరవింద్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు.