Allu Arjun : మళ్లీ అల్లు అర్జున్ పబ్లిక్ మీటింగ్ కి వచ్చే సాహసం చేస్తాడా..? డాకు మహారాజ్ ఈవెంట్ కి బన్నీ వస్తే మాత్రం..!
ప్రధానాంశాలు:
Allu Arjun : మళ్లీ అల్లు అర్జున్ పబ్లిక్ మీటింగ్ కి వచ్చే సాహసం చేస్తాడా..? డాకు మహారాజ్ ఈవెంట్ కి బన్నీ వస్తే మాత్రం..!
Allu Arjun : పుష్ప 2 షాక్ తో అల్లు అర్జున్ మరోసారి Daku Maharaj పబ్లిక్ లోకి రావడం కష్టమే అన్నట్టు పరిస్థితి ఉంది. పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన ఘటన వల్ల పరిశ్రమ చాలా పెద్ద సమస్యల్లో పడినట్టే అనిపిస్తుంది. తెలంగాణాలో అయితే ఇక మీదట బెనిఫిట్ షోస్ మాత్రమే కాదు టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించాడు. ఈ మొత్తం ఇష్యూలో సెంటర్ గా ఉంది అల్లు అర్జున్ మాత్రమే. ఇదిలాఉంటే అల్లు అర్జున్ కొన్నాళ్ల పాటు బయట కనిపించకుండా ఉంటేనే బెటర్. ముఖ్యంగా సినిమా ఈవెంట్స్ కు అల్లు అర్జున్ స్కిప్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఐతే ఇదిలాఉంటే లేటెస్ట్ గా బాలయ్య బాబు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వస్తాడని టాక్ నడుస్తుంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ రెండుసార్లు వచ్చాడు.
Allu Arjunడాకు మహారాజ్ ఈవెంట్ కి..
బాలకృష్ణ, అల్లు అర్జున్ ఇద్దరు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అందుకే డాకు మహారాజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ని పిలవాలని చూస్తున్నారట. ఐతే బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ గెస్ట్ గా రావాల్సిన అవసరం లేదు. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా ఏమి అనుకోరు. కానీ ఇలాంటి టైం లో అల్లు అర్జున్ గెస్ట్ గా రావడం మాత్రం కాస్త చర్చల్లో ఉండే
ఛాన్స్ ఉంటుంది.
అల్లు అర్జున్ నే ఎందుకు మరెవరైనా తీసుకొచ్చే ప్లాన్ చేయొచ్చుగా అంటున్నారు. ఐతే ఎన్ టీ ఆర్ ని తీసుకొచ్చి తమ మధ్య ఎలాంటి గ్యాప్ లు లేవని ప్రూవ్ చేస్తారని అనుకుంటే డాకు మహారాజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ని పిలవాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియదు కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.