Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  ఆర్య సిరీస్ లో అల్లు అర్జున్ లేడా..?

  •  క్రేజీ ప్రాజెక్ట్ నుండి అల్లు అర్జున్ ను తప్పించారా..?

  •  Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు

Arya 3 Movie : టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ సభ్యుడైన ఆశిష్‌ను హీరోగా స్థిరపరచాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు ‘రౌడీ బాయ్స్’, ‘లవ్ మి’ ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. ‘రౌడీ బాయ్స్’కి కరోనా సమయంలో విడుదల కావడం వల్ల కలిగిన సమస్యలు, ‘లవ్ మి’ సినిమాకు ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాకపోవడంతో నిరాశ ఎదురైంది…

Arya 3 Movie ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు దిల్ రాజు

Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు

Arya 3 Movie : అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ మరొక హీరోనా..?

“సెల్ఫిష్” సినిమా సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రూపొందుతోంది అని తెలిపారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయినప్పటికీ, అవుట్‌పుట్ అంతగా సంతృప్తికరంగా లేకపోవడం వల్ల సినిమాను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టామని తెలిపారు. అన్ని అంశాలు సరిగా సెట్ అయిన తర్వాత మాత్రమే మళ్లీ షూటింగ్ కొనసాగిస్తామని చెప్పారు. తక్కువ కస్టుతో చేయలేని కథ కావడంతో పూర్తి నిబద్ధతతో చేయాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.

‘ఆర్య-3’ టైటిల్ రిజిస్టర్ చేసిన విషయాన్ని దిల్ రాజు ధ్రువీకరించారు. సుకుమార్, తాము కలిసి ఒక ఐడియాను అభివృద్ధి చేయాలనుకున్నామని, కానీ పూర్తి కథ ఇంకా రెడీ కాలేదని అన్నారు. ఇది అల్లు అర్జున్‌తో చేయాలా, ఆశిష్‌తో చేయాలా అనే అంశం స్క్రిప్టు తుదిరూపాన్ని బట్టి నిర్ణయిస్తామన్నారు. ఇక ఆశిష్ త్వరలో ‘దేత్తడి’ అనే సినిమా చేయబోతున్నాడు. ఇది దిల్ రాజు బ్యానర్‌లో రూపొందనుండగా, మరో కొత్త సినిమా కూడా ఓకే అయిందని, అది బయటి బ్యానర్‌లో నిర్మాణం కాగలదని వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయని తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది