Pushpa 2 The Rule Trailer : పుష్ప 2 ట్రైలర్.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. వైల్డ్ ఫైర్ గూస్ బంప్స్..!
ప్రధానాంశాలు:
Pushpa 2 The Rule Trailer : పుష్ప 2 ట్రైలర్.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. వైల్డ్ ఫైర్ గూస్ బంప్స్..!
Pushpa 2 The Rule Trailer : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 Pushpa 1 Movie సూపర్ హిట్ కాగా ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 Pushpa 2 Movie త్వరలో రాబోతుంది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ బీహార్ లోని పాట్నాలో రిలీజ్ చేశారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అటెండ్ అయ్యారు. సినిమాపై ఉన్న ఈ బజ్ కి తగినట్టుగానే ట్రైలర్ ఉంది. ఇక ట్రైలర్ లో మెయిన్ గా పుష్ప రాజ్ అదే మన అల్లు అర్జున్ మేనరిజం.. సుకుమార్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తక్కువ లేకుండా ట్రైలర్ ఉంది.
ముఖ్యంగా ఆ టేకింగ్.. ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ చూశాక సినిమా పక్కా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా ఉందని అనిపిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్.. ట్రైలర్ చివర్లో ఈ మాత్రం కిక్ ఇస్తే ఇక జనాలు ఆగుతారా.. ట్రైలర్ ఏవేవి పెట్టాలో వాటికి లెక్క ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ మరోసారి ట్రైలర్ తోనే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు. పుష్ప 2 ట్రైలర్ తోనే చాలా పెద్ద మ్యాటర్ ఉనని లెక్క తేల్చి చెప్పాడు. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ అదరగొట్టేశాడు.
ఏది ఏమైనా ట్రైలర్ మీద ఉన్న అంచనాలకు సుకుమార్ అంతకుమించి అనిపిణేలా విజువల్స్ చూపించాడు. భారీ కాదు అంతకుమించి అనిపించే యాక్షన్ ఘట్టాలతో నీయవ్వ తగ్గేదేలే అని ఆడియన్స్ తో కూడా అనిపించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నాడు. ఇక డిసెంబర్ 5న థియేటర్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. Pushpa 2 The Rule Trailer , Allu Arjun Sukumar, Rashmika