Samantha : స‌మంత కోసం అల్లు అర్జున్‌ రిక‌మండేష‌న్.. పుష్ప 2లోను సంద‌డి చేయ‌నుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : స‌మంత కోసం అల్లు అర్జున్‌ రిక‌మండేష‌న్.. పుష్ప 2లోను సంద‌డి చేయ‌నుందా?

Samantha : గ‌త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పెద్ద హిట్ కొట్టిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం పుష్ప‌. ఈ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికీ ఈ సినిమా ఫీవ‌ర్ న‌డుస్తుంది. `పుష్ప` కరోనా సమయంలో విడుదలై మూడువందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి సంచలనంగా మారింది. ఇక `పుష్ప2` తో బాక్సాఫీసు రికార్డ్ ల వేటకు సిద్ధమవుతున్నాడు. పుష్ప 2 చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా కంటిన్యూ కానుంది. మిగిలిన […]

 Authored By sandeep | The Telugu News | Updated on :26 March 2022,12:00 pm

Samantha : గ‌త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పెద్ద హిట్ కొట్టిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం పుష్ప‌. ఈ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికీ ఈ సినిమా ఫీవ‌ర్ న‌డుస్తుంది. `పుష్ప` కరోనా సమయంలో విడుదలై మూడువందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి సంచలనంగా మారింది. ఇక `పుష్ప2` తో బాక్సాఫీసు రికార్డ్ ల వేటకు సిద్ధమవుతున్నాడు. పుష్ప 2 చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా కంటిన్యూ కానుంది. మిగిలిన పాత్రలన్నీ ఉండబోతున్నాయి. విలన్‌గా ఫహద్‌ ఫాజిల్‌, అలాగే అనసూయ, సునీల్‌ పాత్రలు యధావిధిగా ఉండబోతున్నాయి. దీనికితోడు అందాల సీనియర్‌ తార ఇంద్రజని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం.

గ్లామ‌ర్ కోసం పుష్ప 2 లో దిశా ప‌టానీని తీసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే సమంత కోసం ప్రత్యేకంగా స్పెషల్‌ రోల్‌ డిజైన్‌ చేస్తున్నార‌నే టాక్ కూడా న‌డుస్తుంది. స‌మంత దర్శకుడు సుకుమార్‌ తనకు లక్కీ సెంటిమెంట్‌గా మారింది. `రంగస్థలం`లో ఆమె హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్‌ చేశారు. దర్శకుడిగా ఆ చిత్రంతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఆ తర్వాత తీసిన `పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌ రూపంలో సమంతని పెట్టి ఆ సెంటిమెంట్‌ని రిపీట్‌ చేశాడు. దీంతో సమంత తనకు లక్కీ ఛార్మ్ గా మారిందని భావిస్తున్నారట.దీంతోమరోసారి ఆమెని రిపీట్‌ చేయాలనుకుంటున్నారట. కాకపోతే ఆమెతో ఐటెమ్‌ సాంగ్‌ చేయిస్తాడా? లేక మరేదైనా కీ రోల్‌ చేయిస్తాడా? అనేది సస్పెన్స్ గా ఉంది.

Allu Arjun Recommendation for Samantha plays a role in pushpa 2

Allu Arjun Recommendation for Samantha plays a role in pushpa 2

Samantha : స‌మంత‌కి బ‌న్నీ స‌పోర్ట్..

సమంతకి కూడా `పుష్ప` చాలా హెల్ప్ అయ్యింది. నాగచైతన్యతో విడాకుల అనంతరం బ్యాక్‌ అయిన ఆమెకి `పుష్ప` పెద్ద బూస్ట్ నిచ్చింది. తన క్రేజ్‌ని చాటి చెప్పింది. ఓ రకంగా సమంతకి కమ్‌బ్యాక్‌కి ఫుల్‌ ఎనర్జీనిచ్చింది. ఇందులో ఆమె చేసిన సాంగ్‌కి విశేషస్పందన లభించింది. సమంత బోల్డ్ నిర్ణయంతో, హాట్‌గా కనిపించి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. ఎంతో మందికి దగ్గరైంది. ఇన్‌స్పైరింగ్‌గా నిలిచింది. పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌ని సమంత చేత చేయించడం కోసం అల్లు అర్జున్‌ స్వయంగా ఇన్‌వాల్వ్ అయ్యారు. సమంతని ఒప్పించాడు. ఆమెకి మంచి పేరుని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మరోసారి ఆ రిస్క్ బన్నీ తీసుకుంటాడా? అనేది చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది