Home » Entertainment » Allu Arjun Remuneration News Fake Says Pr Team
Entertainment

Allu Arjun : అల్లు అర్జున్‌ వంద కోట్లు.. అసలు విషయాన్ని చెప్పిన పీఆర్ టీమ్‌

Authored By
Himanshi
The Telugu News | Updated on: January 25, 2022, 2:56 pm
Advertisement

Allu Arjun : పుష్ప సినిమా తో అల్లు అర్జున్‌ స్టార్‌ డమ్‌ ఒక్కసారిగా పెరిగి పోయింది. అతడి పాన్ ఇండియా క్రేజ్‌ తో ముందు ముందు చేయబోతున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే అవ్వబోతున్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ మరింతగా పెరుగుతుందని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు. అందుకే లైకా ప్రొడక్షన్స్ వారు అల్లు అర్జున్‌ తో ఏకంగా వంద కోట్లకు గాను ఒప్పందం చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ విషయమై బన్నీ పీఆర్‌ టీమ్‌ అనధికారికంగా స్పందించింది. లైకా ప్రొడక్షన్స్ లో బన్నీ సినిమా కమిట్‌ అయ్యి చాలా కాలం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా ను వాయిదా వేస్తు వచ్చారు. ఇప్పుడు ఆ సినిమా ను చేసేందుకు వారు కథ ను సిద్దం చేయిస్తున్నారు.

Advertisement

సినిమా కమిట్‌ అయిన సమయంలో పారితోషికంను గురించి చర్చ ఉండదు. అడ్వాన్స్ గా మాత్రం కొంత మొత్తంను ఇవ్వడం జరిగింది. కనుక పారితోషికంను మొత్తంగా సినిమా పట్టాలెక్కే సమయంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. సినిమా ప్రారంభం అయ్యేది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కనుక పారితోషికం గురించి ఇప్పటి నుండే చర్చ జరిగే అవకాశం లేదు అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. అయితే బన్నీకి వంద కోట్ల పారితోషికం స్థాయి ఉంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు కాకున్నా సినిమా ప్రారంభం అయ్యే సమయంకు అయినా కూడా లైకా వారు పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నందుకు గాను బన్నీకి వంద కోట్ల పారితోషికంను ఇవ్వాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

allu arjun remuneration news fake says pr team

Advertisement

Allu Arjun : పుష్ప 2 తర్వాతే ఆ విషయాలపై చర్చ

అల్లు అర్జున్‌ పుష్ప రెండు పార్ట్‌ లకు కలిపి ఇప్పటికే పారితోషికం కమిట్‌ అయ్యాడు. బల్క్ అమౌంట్‌ తో పాటు లాభాల్లో వాటాను బన్నీ దక్కించుకుంటున్నాడు. అల్లు అర్జున్‌ హీరోగా ఇప్పటికే పుష్ప సినిమా కు గాను భారీ మొత్తాన్ని దక్కించుకున్నాడు అనేది టాక్‌. ఇప్పుడు పుష్ప 2 కు కూడా పారితోషికం తో పాటు లాభాల్లో వాటా కూడా ఉంటుంది. సినిమా కనుక మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఒక్క పుష్ప రెండు పార్ట్‌ లతో బన్నీ ఖాతాలో రెండు వందల కోట్లకు పైగా పారితోషికం పడ్డట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ మరియు తమిళ స్టార్‌ లు విజయ్ లు మాత్రమే వంద కోట్ల పారితోషింకను అందుకుంటున్నారు. ఇప్పుడు బన్నీ ఆ స్థాయి పారితోషికం అందుకోవడం రికార్డు గా చెప్పుకోవచ్చు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి