Allu Arjun : భార్య‌తో షికార్లు కొడుతున్న అల్లు అర్జున్.. వైర‌ల్‌గా మారిన సెల్ఫీ

Allu Arjun : పుష్ప సినిమాతో స్టైలిస్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ త్వ‌ర‌లో పుష్ప 2తో ప‌ల‌క‌రించ‌నున్నాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత అద్భుతమైన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండవ భాగం షూటింగ్ మరి కొద్ది రోజుల్లో మొదలు కానుంది. అయితే మ‌ళ్లీ షూటింగ్‌తో బిజీ అయితే ఫ్యామిలీతో బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యం ఉంటుందో ఉండ‌దో అనుకున్నాడో ఏమో కాని బ‌న్నీ తాజాగా హైదరాబాద్‌లో స్నేహాతో క‌లిసి ఔటింగ్‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు క‌లిసి ఓ సెల్పీ తీసుకున్నారు.

ఇదే సెల్పీని స్నేహ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.డార్క్ బ్లూ క‌ల‌ర్ ట్రౌజ‌ర్‌లో బ‌న్నీ, తెలుపు రంగు కోట్‌లో స్నేహ క్యూట్ స్మైల్ ఇస్తూ దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ పిక్ నెట్టింట తెగ వైర‌ల్ అయింది. నెటిజ‌న్స్ కూడా ఈ పిక్స్ పై స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన విడుదలయి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కాకుండా ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, అజయ్ ఘోష్, శత్రు లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

allu arjun selfie with sneha reddy

Allu Arjun : ఫ్యామిలీ టైం..

పుష్ప సినిమా నార్త్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో ఇప్పుడు రెండో భాగం మీద ఐదు భాషల ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ సహా సినిమా యూనిట్ అంతా ఇటీవ‌ల సమావేశం అయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చిత్ర బృందంతో మాట్లాడటానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2ని భారీగా తెర‌కెక్కించి దేశ వ్యాప్తంగా విడుద‌ల చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌ని అనుకుంటున్నాడు బ‌న్నీ.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

40 minutes ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

4 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

7 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

8 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

11 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

14 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago