Pushpa 2 The Rule : చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ Allu Arjun ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో చిన్న రోల్ లో కనిపించాడు. ఆతర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. రాఘవేంద్ర రావు దర్శకత్వలో తెరకెక్కిన గంగోత్రి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డాడీ సినిమాలో అల్లు అర్జున్ చేసిన డాన్స్ చూసి ఫిదా అయిన రాఘవేంద్రరావు. అల్లు అర్జున్ కు వందరూపాయిలు ఇచ్చారట. అదే ఆయన మొదటి రెమ్యునరేషన్. రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అందుకున్న వందరూపాయిలను ఇప్పటికి పదిలంగా దాచుకున్నారట బన్నీ.
కెరీర్ బిగినింగ్ లో ఉన్నబన్నీకి.. ఇప్పుడు ఉన్న బన్నీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో ఎవరైతే ఆయనని విమర్శించారో వారే ఇప్పుడు అల్లు అర్జున్‌ని ఆకాశానికి ఎత్తుతున్నారు. పుష్ప చిత్రానికి గాను బన్నీ నేషనల్ అవార్డ్ కూడా అందుకొని సత్తా చాటాడు. ఇప్పటి వరకూ బెస్ట్ హీరో క్యాటగిరీలో టాలీవుడ్ కి జాతీయ అవార్డ్ రాలేదు. కాని అల్లు అర్జున్ పుష్ప సినిమాతో చెక్ పెట్టాడు. వంద రూపాయల రెమ్యునరేషన్‌తో తన కెరీర్ మొదలు పెట్టిన బన్నీ ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు అందుకుంటున్నట్టు సమాచారం. ఫోర్బ్స్ ప్రకారం 2024లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల జాబితాలో బన్నీ కూడా ఒకరు.
బన్నీ ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా ఉండగా, ఆయన రెమ్యునరేషన్ ప్రతి సినిమాకి పెరుగుతూ పోతుంది. కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే అప్పుడు వంద రూపాయలని బన్నీ రెమ్యునరేషన్‌గా అందుకోవడం పుష్ప2 రిలీజ్ సమయంలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో ఎందరో హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు.. స్టార్ హీరోలుగా మార్చిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుది కాగా, బన్నీని కూడా రాఘవేంద్రరావు లాంచ్ చేశారు. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ను దర్శకేంద్రుడు పరిచయం చేయగా, ఆయన ఓ సందర్భంలో ఇచ్చిన వందరూపాయలనే బన్నీ చాలా ఇష్టంగా దాచుకున్నాడట.ఇక బన్నీ నటించిన పుష్ప2 రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా రచ్చ చేస్తుంది.
9 Planests : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఖగోళంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి.…
ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో జుట్టును కత్తిరించుకోవడం సహజం. కానీ మంగళవారం రోజు మాత్రం ఎవరు జుట్టు కత్తిరించరు.…
Maharashtra : మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు రోజుల ముందు, పాలక కూటమి ఇంకా అధికారంలో ఉన్న…
Pushpa 2 The Rule Live Updates : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబోలో…
నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల, సునీల్, అనసూయ, రావు రమేష్ సంగీతం : దేవి శ్రీ…
Pushpa 2 The Rule Movie Review : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబినేషన్ లో భారీ…
Ganga Water : హరిద్వార్‌లోని గంగా నది నీరు 'బి' కేటగిరీలో ఉన్నట్లు గుర్తించబడిందని, ఇది త్రాగడానికి సురక్షితం కాదని,…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi ఆరు పదుల వయస్సులో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. చిరంజీవిని ఇప్పుడు…
This website uses cookies.