Allu arjun : మెగా ఫ్యామిలీకి అల్లు వారు దూరమవుతున్నారా… అల్లు అర్జున్ దానికి కారణమా..?
Allu arjun : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. చాలా మంది హీరోలు మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకుని తెర మీదకు వచ్చి స్టార్ డమ్ సంపాధించుకున్నారు. అటువంటి హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ లా కొనసాగుతున్నా కానీ ఆయన మొదట్లో మెగా ఫ్యామిలీ అనే టాగ్ లైన్ తో నే లైమ్ లైట్ లోకి వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి అనేక వేదికల మీద అల్లు అర్జున్ చేసిన ప్రసంగాలు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. కానీ ఓడలు బల్లవడం.. బల్లు ఓడలవడం చాలా రంగాల్లో కామన్. అలాగే మెగా ఫ్యామిలీకి, అల్లూ ఫ్యామిలీకి మధ్య దూరం కూడా పెరిగిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి దూరం పెరిగేందుకు చాలా కారణాలున్నాయి అనేక మంది చెబుతున్నారు. మొదట వీరి మధ్య సాన్నిహిత్యం చెడింది మా ఎన్నికల్లో అంటున్నారు. మా ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. కానీ అల్లూ ఫ్యామిలీ ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. అంతే కాకుండా అల్లూ ఫ్యామిలీ నెలకొల్పిన ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోకు మొదటి ఎపిసోడ్ లోనే మా అధ్యక్షుడిగా ఎన్నికయిన మంచు కుటుంబం గెస్ట్ లుగా వచ్చింది.
Allu arjun : అదే రీజనా?
అంతే కాకుండా ఐకాన్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమా కూడా ఈ రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరగడానికి ఓ కారణం అని చెబుతున్నారు. మొదట ఆచార్య సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని భావించారట. అప్పటికి ఇక పుష్ప సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కానీ పుష్ప సినిమాను కూడా డిసెంబర్ 17నే రిలీజ్ చేయాలని నిర్ణయించడం మెగాస్టార్ కు కోపం తెప్పించిందట. కానీ అసలే నష్టాల్లో ఉన్న చిత్ర పరిశ్రమ మరింత నష్టపోకూడదనే మెగాస్టార్ చిరంజీవి వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.