Janaki Kalaganaledu Amardeep : ఎలాంటి కోడలు కావాలనుకున్నానో.. అమర్ దీప్ తల్లి ఎమోషనల్
Janaki Kalaganaledu Amardeep : జానకి కలగనలేదు సీరియల్‌తో అమర్ దీప్ ఇప్పుడు బుల్లితెరపై తిరుగులేని స్టార్డంను సంపాదించుకున్నాడు. ఇది వరకు ఎప్పుడూ రాని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. జానకి కలగనలేదు సీరియల్‌లో రామచంద్ర పాత్రతో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు అమర్ దీప్. ఇక అమర్ దీప్ ప్రేమ వ్యవహారం ఎప్పుడూ కూడా బయటకు రాలేదు. ఒక్కసారి సడెన్‌గా అమర్ దీపి ఎంగేజ్మెంట్ ఫోటోలు కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అది కూడా సీరియల్ నటితోనే ఎంగేజ్మెంట్ అని తెలియడంతో మరింత షాక్ అయ్యారు. కోయిలమ్మ సీరియల్‌తో తేజస్వీని గౌడ ఎంతో ఫేమస్ అయింది. ఈమె కన్నడ నటి అయినా కూడా తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయింది…
ఇక ఇప్పుడ కేరాఫ్ అనసూయ అనే సీరియల్‌తో రాయుడి పెళ్లాంగా మంచి ఇమేజ్ దక్కించుకుంది. ఈ తేజస్వీ అమర్ దీప్‌ల ప్రేమ విషయం ఎప్పుడూ కూడా బయటకు రాలేదు. ఒక్కసారి ఎంగేజ్మ్ంట్ జరిగిందని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అయితే దీనిపై అమర్ దీప్ తల్లి కూడా ఎంతో ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. తన కొడుక్కి చక్కని భార్య దొరికిందంటూ చెప్పుకొచ్చింది. జానకి కలగనలేదు ఫేమ్ మల్లిక అంటే.. విష్ణుప్రియ ఓ వ్లాగ్ చేసింది. అందులో అమర్ దీప్ ఎంగేజ్మెంట్ గురించి చెప్పింది. ఈ విషయాన్ని విష్ణుప్రియ తన వ్లాగ్‌లో బంధించింది. మల్లిక, జానకి ఇద్దరూ రూంలో రెడీ అవుతుంటే.. అమర్ దీప్ తల్లి వస్తుంది.
Amardeep Chowdhary mother reaction on his engagement and tejaswini gowda
ఈమె అమర్ దీప్ మదర్.. అంటే నాకు కూడా మదర్.. ఈ క్షణం నుంచి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తోందో.. ఓ మంచి సంబంధం ఉంటే చెప్పమని నాతో ఎప్పుడూ అంటూ ఉండేది.. వీరి విషయాన్ని మూడు నెలలు మనసులో దాచుకోలేకపోయా అని విష్ణుప్రియ అంటుంది. మాకు మంచి కోడలు, అందమైన కోడలు దొరికింది.. పాటలు పాడుతుంది.. డ్యాన్స్ చేస్తుంది.. పైగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది.. క్లాసికల్ ఫ్యామిలీకి.. క్లాసికల్ కోడలు దొరికింది.. నేను ఎలాంటి కోడలు కావాలని అనుకున్నానో.. మాకు అలాంటి కోడలే దొరికింది అంటూ అమర్ దీప్ తల్లి ఎమోషనల్ అయింది.
