
Heroine Laila Appreciates Rashmi Gautam Capacity as Jabardasth Anchor
Rashmi Gautam : రష్మీ గౌతమ్ ప్రస్తుతం యాంకర్‌గా మూడు షోలకు వ్యవహరిస్తోంది. ఇక వారంలో మూడు రోజులు రష్మీ సందడే కనిపిస్తుంది. అసలే రష్మీ ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బుల్లితెర మీదనే పెట్టేసింది. సిల్వర్ స్క్రీన్ అంటూ అందరిలా పక్క చూపులేమీ చూడటం లేదు. దీంతో రష్మీకి బుల్లితెరపై మంచి డిమాండ్ ఏర్పడింది. తనతోటి వాళ్లంత కూడా సినిమాలు, పక్క చానెళ్లు అని సైడ్ అయిపోతోన్నారు. కానీ రష్మీ మాత్రం అక్కడే ఉంటోంది. అలా యాంకర్ రష్మీ ఇప్పుడు అన్ని షోలను కైవసం చేసుకుంటోంది. సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు యాంకర్‌గా వెళ్లింది రష్మీ. ఇటు అనసూయ జబర్దస్త్ షోను వదిలిపోవడంతో.. మళ్లీ రష్మీనే ఆ స్థానాన్ని భర్తీ చేసేస్తోంది.
అలా మొత్తానికి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలకు రష్మీనే యాంకర్‌గా మారింది. అలా రష్మీ ఇప్పుడు మూడు షోలతో వారానికి మూడు రోజులు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకే తనను భరించండి.. ప్లీజ్ అంటూ అభిమానులకు రష్మీ వేడుకుంటూ ఓ పోస్ట్ వేసింది. దీనిపై హీరోయిన్ నవ్వుల లైలా స్పందించింది. లైలాకి రష్మికి పరిచయం ఎక్కడ మొదలైందని అనుకుంటున్నారా? ఇది వరకు ఆ షోలో లైలా ఓ రెండు మూడు ఎపిసోడ్‌లకు జడ్జ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన ఎపిసోడ్స్‌లో లైలా తన నవ్వులతో అందరినీ మాయ చేసేసింది. ఇక ఇప్పుడు ఇలా రష్మీ మీద ప్రేమను కురిపించింది. రష్మీ వేసిన పోస్ట్ మీద స్పందించడంతో..
Heroine Laila Appreciates Rashmi Gautam Capacity as Jabardasth Anchor
తిరిగి రష్మీ కూడా ఎమోషనల్‌గా రియాక్ట్ అయింది. కొత్త వాళ్లు వచ్చే వరకు దయచేసి నన్ను భరించండి అంటూ రష్మీ వేసిన ఈ పోస్ట్ మీద లైలా ఇలా స్పందించింది. రష్మీ.. నువ్ ఏ షోనైనా అదరగొట్టేస్తావ్.. యూ విల్ రాక్ ది షో.. నువ్ హోస్ట్‌గా చేసే ప్రతీ షోకి నీ హోస్టింగ్‌తో ప్రాణం పోస్తావ్.. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తావ్.. అంటూ ఇలా ప్రోత్సహించింది. రష్మీని ప్రశంసించింది. లైలా కామెంట్‌కు రష్మీ రిప్లై ఇచ్చింది. ఈ మాటలు చాలు మేడం.. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ్ థాంక్స్ అన్నట్టుగా రష్మీ కూడా స్పందించింది.
Heroine Laila Appreciates Rashmi Gautam Capacity as Jabardasth Anchor
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
This website uses cookies.