Home » Entertainment » Anasuya Bharadwaj About Flight Journey
Entertainment

Anasuya Bharadwaj : మొత్తానికి దొరకపట్టేసిందట.. చివరక్షణాల్లోఉత్కంఠగా అనసూయ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 11, 2021, 1:59 pm
Advertisement

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. మా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచింది. ప్రకాష్ రాజ్ తరుపును ప్యానెల్ మెంబర్‌గా గెలిచిన అనసూయ.. భారీ మెజార్టీని సొంతం చేసుకుంది. అయితే అనసూయ నిన్న మా ఎన్నికలతో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అలా మా ఎన్నికలు, అందులో ఓటు వేయడంతో అనసూయ బిజీగా ఉండటంతో ఆమె ప్రయాణానికి కాస్త భంగం కలిగినట్టు కనిపిస్తోంది. అనసూయ ఎక్కడికో ప్రయాణసాగిస్తోంది.

Advertisement

Anasuya Bharadwaj About Flight Journey

అసలే అనసూయ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. మాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తిరుగుతోంది. అలా అనసూయ ముంబై, కేరళ, హైద్రాబాద్ అంటూ తిరుగుతోంది. అయితే నిన్న మా ఎన్నికల హడావిడి వల్ల ఎయిర్ పోర్టుకు వెళ్లడం కాస్త ఆలస్యమైనట్టు కనిపిస్తోంది. కానీ చివరి క్షణాల్లో ఆ ఉత్కంఠ మరింత ఎక్కువైందట. అసలు ఫ్లైట్ దొరుకుతుందా? లేదా అని తెగ ఆందోళన పడినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు చివరకు కథ సుఖాంతం అయిందని చెప్పుకొచ్చింది.

Advertisement

Anasuya Bharadwaj : ప్రయాణంలో అనసూయ పరుగులు..

Anasuya Bharadwaj About Flight Journey

ఈ మేరకు ఉరుకుపరుగులతోనే అనసూయ వెళ్లినట్టు కనిపిస్తోంది. చివరకు విమానంలో కూర్చున్న అనసూయ.. అసలు సంగతిని చెప్పేసింది. ఈ రోజు ఈ ఫ్లైట్‌ను పట్టుకోవడం ఎంతో సినిమాటిక్, డ్రామాగా జరిగిందని అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఫ్లైట్ దొరకడంతో ఎంతో ప్రశాంతంగా అనిపించింది.. థాంక్యూ బాబాజీ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడికి వెళ్తోందో మాత్రం చెప్పలేదు. మళ్లీ కలిసే వరకు బై అంటూ వీడ్కోలు తీసుకుంది అనసూయ.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి