Anasuya Demand Remuneration in Acharya Movie
Anasuya: బుల్లితెరకి గ్లామర్ అద్దిన అందాల హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది అనసూయ. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలతో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంటుంది. `జబర్దస్త్` ఎపిసోడ్ కోసం ఆమె పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంటాయి. ఎప్పుడూ అనసూయ డ్రెస్‌లపై, ఆమె పోజులపై నెటిజన్లు ఏదో రకమైన విమర్శలు చేస్తూనే ఉంటారు. వాటికి అదే రేంజ్‌లో కౌంటర్లిస్తుంది అనసూయ. అందుకే కొంటె నెటిజన్లకి తనదైన స్టయిల్‌లో సమాధానం చెబుతూ వాళ్ల నోళ్లు మూయిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది అనసూయ. ఓ వైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణిస్తుంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా విశేష గుర్తింపు తెచ్చుకుంది.
అనసూయ పేరుని రంగమ్మత్తగా పిలిచేంతగా ఆ సినిమాతో పాపులారిటీని దక్కించుకుంది అనసూయ. బుల్లితెరపైనే గ్లామర్, వెండితెరపై నటనతో మెప్పిస్తానని చెబుతుంది అనసూయ. అందుకే బలమైన పాత్రలు చేస్తూ ప్రశంసలందుకుంటుంది. ఇటీవల `ఖిలాడి` చిత్రంలో మెరిసింది. అలాగే `పుష్ప`లోనూ అదరగొట్టింది. మరోవైపు అరడజను సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమాలో అనసూయ రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో లాగే ఈ సినిమా లోనూ పవర్‌ఫుల్ రోల్ చేసిందట ఈ జబర్దస్త్ బ్యూటీ.
Anasuya Demand Remuneration in Acharya Movie
ఆచార్య కోసం కాస్త డిఫరెంట్ లుక్ ట్రై చేశారని సమాచారం. ఆచార్య ఆమె గెటప్ కాస్త కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు. అంతేకాదు అనసూయది కథలో కీలకమైన క్యారెక్టర్ అని, ఈ రోల్ కోసం ఆమెకు 25 లక్షల వరకు రెమ్మ్యూనరేషన్ ఇచ్చారని టాక్. చిన్న పాత్ర కోసం అనసూయ అంత రెమ్యునరేషన్ అందుకుంటుంది అంటే అది గొప్ప విషయమే మరి. ఆచార్య చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషించారు. చెర్రీ సరసన పూజా హెగ్డే ఆడిపాడింది. దేవాదాయ శాఖలో జరుగుతున్న మోసాలను చూపిస్తూ సరికొత్తగా సినిమా రూపొందించారట డైరెక్టర్ కొరటాల శివ.
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
This website uses cookies.