Anasuya : ఆచార్య కోసం అన‌సూయ అంత రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : ఆచార్య కోసం అన‌సూయ అంత రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిందా?

Anasuya: బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల హీరోయిన్ అంటే ఠ‌క్కున గుర్తొచ్చేది అనసూయ‌. ఎప్ప‌టిక‌ప్పుడు తన గ్లామర్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌లో ర‌చ్చ చేస్తుంటుంది. `జబర్దస్త్` ఎపిసోడ్‌ కోసం ఆమె పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో ర‌చ్చ చేస్తుంటాయి. ఎప్పుడూ అనసూయ డ్రెస్‌లపై, ఆమె పోజులపై నెటిజన్లు ఏదో రకమైన విమర్శలు చేస్తూనే ఉంటారు. వాటికి అదే రేంజ్‌లో కౌంటర్లిస్తుంది అనసూయ. అందుకే కొంటె నెటిజన్లకి తనదైన స్టయిల్‌లో సమాధానం చెబుతూ వాళ్ల నోళ్లు మూయిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :2 April 2022,12:30 pm

Anasuya: బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల హీరోయిన్ అంటే ఠ‌క్కున గుర్తొచ్చేది అనసూయ‌. ఎప్ప‌టిక‌ప్పుడు తన గ్లామర్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌లో ర‌చ్చ చేస్తుంటుంది. `జబర్దస్త్` ఎపిసోడ్‌ కోసం ఆమె పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో ర‌చ్చ చేస్తుంటాయి. ఎప్పుడూ అనసూయ డ్రెస్‌లపై, ఆమె పోజులపై నెటిజన్లు ఏదో రకమైన విమర్శలు చేస్తూనే ఉంటారు. వాటికి అదే రేంజ్‌లో కౌంటర్లిస్తుంది అనసూయ. అందుకే కొంటె నెటిజన్లకి తనదైన స్టయిల్‌లో సమాధానం చెబుతూ వాళ్ల నోళ్లు మూయిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది అనసూయ. ఓ వైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణిస్తుంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా విశేష గుర్తింపు తెచ్చుకుంది.

అనసూయ పేరుని రంగమ్మత్తగా పిలిచేంతగా ఆ సినిమాతో పాపులారిటీని ద‌క్కించుకుంది అన‌సూయ‌. బుల్లితెరపైనే గ్లామర్‌, వెండితెరపై నటనతో మెప్పిస్తానని చెబుతుంది అనసూయ. అందుకే బలమైన పాత్రలు చేస్తూ ప్రశంసలందుకుంటుంది. ఇటీవల `ఖిలాడి` చిత్రంలో మెరిసింది. అలాగే `పుష్ప`లోనూ అదరగొట్టింది. మరోవైపు అరడజను సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమాలో అనసూయ రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో లాగే ఈ సినిమా లోనూ పవర్‌ఫుల్ రోల్ చేసిందట ఈ జబర్దస్త్ బ్యూటీ.

Anasuya Demand Remuneration in Acharya Movie

Anasuya Demand Remuneration in Acharya Movie

Anasuya : అన‌సూయ రేంజ్ పెరిగిందిగా..!

ఆచార్య కోసం కాస్త డిఫ‌రెంట్ లుక్ ట్రై చేశార‌ని స‌మాచారం. ఆచార్య ఆమె గెటప్ కాస్త కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు. అంతేకాదు అనసూయది కథలో కీలకమైన క్యారెక్టర్ అని, ఈ రోల్ కోసం ఆమెకు 25 లక్షల వరకు రెమ్మ్యూనరేషన్ ఇచ్చారని టాక్. చిన్న పాత్ర కోసం అన‌సూయ అంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటుంది అంటే అది గొప్ప విష‌య‌మే మ‌రి. ఆచార్య చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది. ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషించారు. చెర్రీ సరసన పూజా హెగ్డే ఆడిపాడింది. దేవాదాయ శాఖలో జరుగుతున్న మోసాలను చూపిస్తూ సరికొత్తగా సినిమా రూపొందించారట డైరెక్టర్ కొరటాల శివ.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది