Home » Entertainment » Anasuya Fires On Youtubers On Abusing Comments Over Body Shaming
Entertainment

Anasuya : పుష్పలో అనసూయపై బాడీ షేమింగ్‌.. దిగజారుతున్నారంటూ యూట్యూబర్లపై యాంకర్ ఫైర్..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 24, 2021, 4:00 pm
Advertisement

Anasuya : జబర్థస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం పుష్ప మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉంది. రంగస్థలం లో రంగమత్త రేంజ్ లో అలరించకున్నా.. దాక్షాయణి‌గా ఊర మాస్ గెటప్‌లో ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా అనసూయకు ఎదురయ్యే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అనసూయ అందాల ప్రదర్శన, ఆమె చేసే వింత ట్వీట్లు, పెట్టే పోస్ట్‌లపై నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. పబ్లిసిటీ పిచ్చి ఉందంటూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. వాటిపై అనసూయ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పటిలాగే తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యింది అనసూయ.

Advertisement

Anasuya fires on youtubers on abusing comments over body shaming

పుష్ప సినిమాలో అనసూయ లావుగా ఉందంటూ యూట్యూబ్ లో దర్శనమిచ్చిన కొన్ని థంబ్ నెయిల్స్ పై ఈ యాంకర్ విరుచుకుపడింది. ఒక్కసారిగా ఆ నెగిటివ్ కామెంట్లను చూసేసరికి ఆమెలో ఆగ్రహం ముంచుకొచ్చింది. వెంటనే ఇన్ స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చిన ఆ థంభ్ నెయిల్స్ పెట్టిన వారిని ఎడా మడా తిట్టేసింది. తాను లైవ్ కు వచ్చానంటే కొందరికి చాలా ఖంగారుగా ఉంటుందంటూ.. ఇప్పుడేం క్లాస్‌ పీకుతుందోనని ఎదురు చూస్తారని చెప్పుకొచ్చింది. తనపై నెగిటివ్ గా పెడుతున్న యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నెయిల్స్ అస్సలు పట్టించుకోకూడదని అనుకుంటానని అయితే కొన్ని సందర్బాల్లో చూడకుండా ఉండలేనని పేర్కొంది.

Advertisement

Anasuya : బాడీ షేమింగ్ పై అనసూయ ఫైర్..!

పుష్ప మూవీలో తన సీన్స్ ను ఉదాహరణగా చూపిస్తూ.. చూడండి అనసూయ ఎంత లావు అయిపోయిందో.. ఓవర్ వెయిట్.. షాకింగ్.. లాంటి థంబ్ నెయిల్స్ పెట్టడం పట్ల తను హర్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. వెయిట్ పెరిగింది నేనే.. కానీ ఈ సందర్భంలో మీ క్యారెక్టర్.. మీ దిగజారుడుతనాన్ని మీరు ఎలా ఎత్తుకుంటారని వారిని ఆమె ప్రశ్నించింది. తను కూడా వాళ్ళ మాదిరి కామెంట్ చేయగలనని.. అయితే అలా ఇతరులను బాధ పెట్టడం తన  వ్యక్తిత్వం కాదని ఆమె చెప్పుకొచ్చింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి