Home » Entertainment » Anasuya On Late Night Shoot And Travles
Entertainment

Anasuya : మా బతుకులు ఇలానే ఉంటాయ్.. అనసూయ కామెంట్స్ వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 15, 2022, 8:00 pm
Advertisement

Anasuya : యాంకర్ అనసూయ బుల్లితెరపై ఎలా సందడి చేస్తుంటుందో అందరికీ తలిసిందే. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చానెల్స్‌ను కవర్ చేస్తుంటుంది. అయితే ఇప్పుడు స్టార్ మాలో సింగింగ్ షోలో కనిపిస్తోంది. అటు జబర్దస్త్ షోకు హోస్ట్‌గానూ వ్యవహరిస్తోంది. ఇలా బుల్లితెరపై ఎంత బిజీగా ఉన్నా కూడా.. తన సినిమా ప్రపంచాన్ని మాత్రం వదలడం లేదు. కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంది. భీష్మపర్వం అనే మలయాళం సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

ఇక ఈ ఏడాది అనసూయ ఖిలాడీ అంటూ తనలోని వేరియేషన్స్ చూపించింది. మొత్తానికి అనసూయ మాత్రం సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ఇప్పుడు దర్జా అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం రెడీగా ఉంది. అది కాకుండా ఆమె చేతిలో ఫుల్ ప్రాజెక్ట్‌లున్నాయి. వెబ్ సిరీస్లు సైతం అనసూయ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అయితే తాజాగా అనసూయ ఓ పోస్ట్ వేసింది. ఇందులో తాను ఉదయం నాలుగు గంటల వరకు పని చేశాను.. ఇప్పుడు ప్యాకప్ చెప్పేశారని అంటోంది.

Anasuya on Late Night Shoot And Travles

Advertisement

యాక్టర్స్ జీవితాలు ఇలానే ఉంటాయ్ అన్నట్టుగా పోస్ట్ పెట్టేసింది. మళ్లీ ఆరున్నర గంటలకు ఫ్లైట్ ఉంది.. వేరే చోటకు వెళ్లి అక్కడ కూడా షూటింగ్ చేయాలని అనసూయ చెప్పుకొచ్చింది. ఇక ఫ్లైట్‌లో ఎక్కిన తరువాత మరో పోస్ట్ చేసింది. నిద్రలేకపోయినా సరే ఇలా ప్రయాణించాల్సిందే అన్నట్టుగా అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి అనసూయ మాత్రం వరుస షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంటోంది. ఇకపై వెంట వెంటనే సినిమాలతో అలరించబోతోందన్న మాట.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి