Balakrishna – Anasuya : బాలయ్యకు జోడిగా అనసూయ.. నందమూరి ఫ్యాన్స్‌ అభిప్రాయం ఇదే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna – Anasuya : బాలయ్యకు జోడిగా అనసూయ.. నందమూరి ఫ్యాన్స్‌ అభిప్రాయం ఇదే?

 Authored By mallesh | The Telugu News | Updated on :20 September 2022,8:30 pm

Balakrishna – Anasuya : నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విడుదలై ఏడాది కావొస్తుంది.ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ విజయాల బాట పట్టింది.కరోనా టైంలో థియేటర్లు మూతబడి ఉండగా.. అఖండ సినిమాతోనే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య బాబుకు హాట్రిక్ హిట్ ఇవ్వగా.. ఇండస్ట్రీలో హిట్ ట్రెండ్ సెట్ చేశాడు బోయపాటి.వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న బాలయ్య.. త్వరలోనే రంగమ్మత్తతో జోడి కట్టనున్నట్టు తెలుస్తోంది.

Balakrishna – Anasuya : రంగమ్మత్త నందమూరి ఫ్యాన్స్‌ను మెప్పిస్తుందా..

బాలయ్య బాబు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో ‘అన్‌స్టాపబుల్’ షో చేస్తున్నాడు. ఇందులో సెలబ్రిటీలను పిలిచి ఇంటర్వ్యూలు చేస్తుంటాడు.ఈ షోకు రేటింగ్స్ కూడా చాలానే వచ్చాయి.మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది.క్రాక్ సినిమాతో హిట కొట్టిన గోపిచంద్.. బాలయ్యను డైరెక్ట్ చేయడం ఇదే తొలిసారి.

Anasuya paired with Balakrishna this is the opinion of nandamuri fans

Anasuya paired with Balakrishna this is the opinion of nandamuri fans

ఇక ఇందులో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తున్నాడు.దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లేదా సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ భావిస్తోందట..

ఇక కామెడీ నేపథ్యంలో సినిమాలు తీస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యబాబు ఒక సినిమా చేయబోతున్నారట..త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో బాలయ్య వయసు మళ్ళిన వ్యక్తిగా పవర్ ఫుల్‌ పాత్రలో కనిపించనుండగా..కుర్ర హీరోయిన్ శ్రీలల బాలయ్య కూతురుగా నటించనుంది.షైన్ మూవీ క్రియేష్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండగా.. ఇందులో స్పెష‌ల్ సాంగ్ కోసం అనసూయను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.బాలయ్యతో అనసూయ కాంబినేషన్ నందమూరి అభిమానులను మెప్పిస్తుందా? అని చర్చ జరుగుతోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది